ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దివ్యాంగుడు- మంత్రి నిమ్మల- ఓ మోటర్​ సైకిల్​ - Minister Nimmala Ramanaidu

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 2, 2024, 3:00 PM IST

minister_nimmala (ETV Bharat)

Minister Nimmala Ramanaidu Drive Motorcycle with Disabled Person : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తన పింఛన్‌ తొలగించారని మంత్రి నిమ్మల రామానాయుడు ముందు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దివ్యాంగుడు మొర పెట్టుకున్నాడు. తనతో పాటు వాళ్ల అమ్మ పింఛన్‌ను కూడా తొలగించారని దివ్యాంగుడు వాపోయాడు. దివ్యాంగుడిని కూర్చోబెట్టుకుని మంత్రి నిమ్మల మోటార్ సైకిల్‌ నడిపారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.

దివ్యాంగుడిని మోటర్​ సైకిల్​పై కూర్చొపెట్టుకొని నడుపుతూ నిమ్మల రామానాయుడు అతని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రయాణంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తన పింఛన్​తో పాటు రేషన్​ కార్డు కూడా తొలగించడానికి చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఇవన్నీ కరెక్ట్​ చేద్దామని నిమ్మల సమాధానం చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి రావడానికి తాము చాలా కష్టపడ్డామని ఈ సందర్భంగా అతడు నిమ్మలకు తెలియజేశారు. ఈ క్రమంలోనే దివ్యాంగుడికి పింఛన్​ వచ్చే విధంగా చేస్తామని మంత్రి నిమ్మల భరోసా ఇచ్చారు. అతనితోపాటు వాళ్ల అమ్మకు కూడా పింఛన్‌ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details