శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు- కఠిన చర్యలు తప్పవు : పల్నాడు ఎస్పీ - Malika Visit Poll Day Attack Places
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 22, 2024, 11:41 AM IST
Malika Garg Warned Spared They Disturb Law And Order: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గార్గ్ హెచ్చరించారు. మాచర్ల నియోజకవర్గంలోని శాంతిభద్రతలపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆమె రెంటచింతల మండలం పాల్వాయిగేటు, తుమృకోట గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
పాల్వాయిగేటు కేంద్రంలోని ఈవీఎంను వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పగలగొట్టిన దృశ్యాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఎస్పీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ రోజు జరిగిన ఘటనల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆ రెండు గ్రామాల్లో పికెట్ నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడారు. ఏ చిన్న అలజడి జరిగినా కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. దాడులకు పాల్పడిన అందరిని అదుపులోకి తీసుకునే పనిలో ఉన్నట్లు ఎస్పీ మలికా గార్గ్ స్పష్టం చేశారు.