కుప్పంలో ఖాళీ అవుతున్న వైఎస్సార్సీపీ- చంద్రబాబు సమక్షంలో కౌన్సిలర్లు, ఎంపీటీసీల చేరిక - Kuppam YSRCP Leaders Joined in TDP - KUPPAM YSRCP LEADERS JOINED IN TDP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 31, 2024, 3:00 PM IST
Kuppam YSRCP Leaders Joined in TDP: ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కుప్పం వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు టీడీపీలో చేరారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సారథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఉండవల్లికి తరలివచ్చారు. ఐదుగురు కౌన్సిలర్లు, 15మంది ఎంపీటీసీలు చంద్రబాబు సమక్షంలో పసుపు కండువాలు కప్పుకొన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కుప్పం అభివృద్ధి చేస్తామనే మాట విస్మరించి మోసగించిందని నేతలు ఆరోపించారు. కుప్పం అభివృద్ధి చెందాలంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గానికి చెందిన మరికొందరు వైఎస్సార్సీపీ నాయకులు త్వరలోనే టీడీపీలోకి వస్తారని ఎమ్మెల్సీ శ్రీకాంత్ తెలిపారు.
కుప్పంలో వైఎస్సార్సీపీ అవినీతి, అరాచకాలపై విచారణ జరుగుతుందని తెలిపారు. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.250కోట్లు కేటాయించినట్లు తెలిపారు. హంద్రీనీవా కాలువ ద్వారా వచ్చే నీటిని నిల్వ చేయడానికి రూ.500కోట్లతో రిజర్వాయర్లు నిర్మిస్తున్నామన్నారు. కుప్పంలో 2,000 ఎకరాలతో సెజ్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 40 రోజుల్లోనే కుప్పం అభివృద్ధికి చంద్రబాబు నిధులు కేటాయిస్తున్నారని ఎమ్మెల్సీ తెలిపారు. తటస్థులుగా ఉండి కుప్పం అభివృద్ధిని కోరుకుంటున్న వారందరినీ కంచర్ల శ్రీకాంత్ తెలుగుదేశంలోకి ఆహ్వానించారు.