ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రజల తీర్పు ఎటువైపో తెలిసిపోయింది - వైఎస్సార్సీపీకి కౌంటింగ్ ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి: కేశినేని చిన్ని - KESINENI CHINNI ON EXIT POLLS - KESINENI CHINNI ON EXIT POLLS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 2, 2024, 9:25 AM IST

Kesineni Chinni on Exit Polls Favour to TDP: రాష్ట్రంలో ప్రజల తీర్పు ఎటువైపు ఉందనే విషయం తేట తెల్లమైపోయిందని, లోక్​సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సుమారు 21 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తే అందులో 18 సంస్థలు ఆంధ్రప్రదేశ్​లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతోందని ప్రకటించాయని, వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని టీడీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని అన్నారు. శనివారం ఎగ్జిట్ పోల్స్ వెలువడటంతో ఎన్డీయే కూటమికి జనాదరణ ఏ స్థాయిలో ఉందో జూన్ 4న తెలుస్తుందని చెప్పారు. 

జగన్ సొంత సంస్థలు చేసిన సర్వేలు మినహా వైఎస్సార్సీపీ గెలుస్తుందని ఏ ఇతర సర్వే చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. వైఎస్సార్సీపీకి కౌంటింగ్ ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. జూన్ 4న నరకాసుర చెర నుంచి రాష్ట్రం బయట పడుతుందని, ప్రజలు దీపావళి జరుపుకునేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబును అసెంబ్లీకి పంపించబోతున్న రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details