అసమర్థ పాలకుల కక్షసాధింపు చర్యలతోనే వైఎస్సార్సీపీకి ఘోర ఓటమి: కాపు జేఏసీ - Kapu JAC Leaders Meeting - KAPU JAC LEADERS MEETING
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 7, 2024, 5:00 PM IST
Kapu JAC Leaders Meeting: అసమర్థ పాలకుల నిర్ణయాలు, కక్ష సాధింపు చర్యల వల్లే ప్రజలు కూటమికి అఖండ విజయాన్ని ఇచ్చారని కాపు జేఏసీ నేతలు అన్నారు. కాకినాడలోని కల్యాణ మండపంలో ఉమ్మడి గోదావరి జిల్లాలోని కాపు జేఏసీ నేతలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కాపు జేఏసీ నేత ఆరేటి ప్రకాశ్, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రం గాడిన పడాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు గ్రహించి, వైఎస్సార్సీపీకి మట్టి కరిపించారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పాలన సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
"అసమర్థ పాలకుల కక్ష సాధింపు చర్యల వల్లే వైఎస్సార్సీపీ ఘోర ఓటమిపాలైంది. రాష్ట్రం గాడిన పడాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం కావాలని ప్రజలు గ్రహించారు. అందుకే ఏపీ ప్రజలు కూటమికి అఖండ విజయాన్ని ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలోనే రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పాలన సాధ్యం అవుతుంది." - కాపు జేఏసీ నాయకులు