ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వెలుగులోకి గల్ఫ్‌ దేశాల బాధితుల వ్యథలు - యాజమాన్యం హింసిస్తోందని మహిళ ఆవేదన - MUSCAT VICTIM CHINNEKKA VIRAL VIDEO - MUSCAT VICTIM CHINNEKKA VIRAL VIDEO

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 30, 2024, 7:04 AM IST

Updated : Jul 30, 2024, 9:16 AM IST

Muscat Victim Chinnekka Viral Video: పొట్టకూటి కోసం పరాయి దేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న బాధితుల కష్టాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మస్కట్​లో దుర్భర జీవితం గడుపుతున్న ఓ మహిళ తన ఆవేదన వెలిబుచ్చింది. ఇప్పటికే పలువురు విదేశాల్లో చిక్కుకోగా లోకేశ్ చొరవ తీసుకుని వారిని స్వదేశానికి తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే తనను కూడా స్వదేశానికి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి వీడియో ద్వారా తన గోడును విన్నవించుకుంది. 

వివరాలివి: కడప జిల్లా చాపాడు మండలం నక్కలదిన్నెకు చెందిన చిన్నెక్క ఉపాధి కోసం మస్కట్​కు వెళ్లింది. అక్కడ చెప్పిన పని కంటే అధికంగా పనులు చేయిస్తూ యాజమాన్యం హింసిస్తోందని బాధితురాలు వాపోయింది. తాను స్వదేశానికి తిరిగి వచ్చే విధంగా ప్రభుత్వం సాయం చేయాలని వీడియో సందేశంలో వేడుకుంది. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ కావడంతో మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పాతిక వేలు ఆర్థిక సాయాన్ని ఆన్‌లైన్‌ ద్వారా పంపారు.

Last Updated : Jul 30, 2024, 9:16 AM IST

ABOUT THE AUTHOR

...view details