ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఇన్‌ఛార్జ్​గా ఆయనుంటే,ప్రత్యర్థి విజయం ఖాయం- వైసీపీ అసమ్మతి నేతల ఆందోళన - YSRCP MLA Candidates Change

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 21, 2024, 11:32 AM IST

Infifghts Kanigiri YSRCP: అధికార వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ ఇన్‌ఛార్జ్‌ల మార్పు కుంపటి రోజురోజుకు రగులుతూనే ఉంది. ప్రకాశం జిల్లా కనిగిరి వైఎస్సార్​సీపీ ఇన్‌ఛార్జ్​గా దద్దాల నారాయణ యాదవ్‌ను అధిష్ఠానం నిర్ణయించింది. అయితే, ఆయన నియామకంపై స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్థానిక నేత బుర్ర మధుసూధన్‌ యాదవ్‌కు మద్దతుగా కనిగిరి, చంద్రశేఖరపురం, పామూరు మండల నాయకులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే అధిష్ఠానం ప్రకటించిన దద్దాల నారాయణ యాదవ్​పై ఉన్న పలు బ్యాంక్‌ నోటీసులు, ఆస్తుల వివాదాలు, దౌర్జన్యాలకు సంబంధించిన పత్రాలను ప్రదర్శిస్తూ కనిగిరి వైఎస్సార్​సీపీ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. చెప్పుడు మాటలు విని అధిష్ఠానం గుడ్డిగా, అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిని ఇన్‌ఛార్జ్‌గా నియమించడం సరికాదన్నారు. ఇన్‌ఛార్జ్‌ నియామకంపై అధిష్ఠానం పునరాలోచన చెయ్యాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా దద్దాలను ఎంపిక చేస్తే, 175 స్థానాల్లో వైఎస్సార్​సీపీ మొదటగా ఓడిపోయేది కనిగిరిలోనేనని వారు ఎద్దేవా చేశారు. దద్దాల ఎన్నికల బరిలో నిల్చుంటే కచ్చితంగా ప్రత్యర్థులు విజయం సాధిస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details