ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సినీఫక్కిలో వైసీపీ నేతల కార్లను చేజ్ చేసిన అధికారులు- 20 బస్తాల్లో 4232 మద్యం బాటిళ్లు స్వాధీనం - SEB Police Seized Liquor Dump

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 21, 2024, 3:50 PM IST

Updated : Apr 21, 2024, 5:40 PM IST

Illegal Liquor Seized in Nellore District : వైసీపీ నేతల అధికార దాహానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఎన్నికల్లో ఓటర్ల తాయిలాలు ఇచ్చేందుకు ఎన్నెన్నో కుయ్యుక్తులు పన్నుతున్నారు. ముఖ్యంగా లిక్కర్ ను పంచేందుకు వీలైనన్ని మార్గాలను వెదుకుతున్నారు. ఈ క్రమంలో ఏకంగా 20 బస్తాల్లో 4వేలకు పైగా మద్యం బాటిళ్లను ఓ వైసీపీ నేత ఇంటి వద్ద నిల్వ చేసుకున్నాడు. అర్థరాత్రి సమయంలో సమాచారం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన అక్కడికి వెళ్లేలోగా, నిందితులు మద్యం బాటిళ్లను మూడు కార్లలో వేరో చోటుకి తరలించే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సినీ ఫక్కీలో ఆ కార్లను వెంబడించి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.    

SEB Police Seized Liquor Dump : వివరాల్లోకి వెళ్లే, నెల్లూరు జిల్లాలో ఈరోజు భారీగా మద్యం పట్టుబడింది. జిల్లాలోని ముత్తుకూరు మండలం పంటపాలెం గ్రామంలోని అధికార పార్టీ నేత మారం సుధాకర్ రెడ్డి నివాసం వద్ద మద్యం నిల్వలు ఉంచినట్లు సి విజిల్ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే ఫ్లైయింగ్ స్క్వాడ్, సెబ్ అధికారులు అక్కడికి వెళ్లి తనిఖీలు మెుదలుపెట్టారు. అయితే అప్పటికే అధికారులు వస్తున్నారని విషయం తెలుసుకున్న నిందితులు మద్యం బాటిళ్లను బస్తాల్లో మూటకట్టి కార్లలో తరలించేశారు. దీంతో అధికారులు ఆ కార్లను వెంబడించి మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 20 బస్తాల్లో ఉన్న 4232 మద్యం బాటిళ్లు, మూడు కార్లను సీజ్ చేశారు. అలాగే మారం సుధాకర్ రెడ్డి తోపాటు నలుగురిపై కేసు నమోదు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా అక్రమంగా మద్యం రవాణా చేసినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఇందుకూరుపేట సెబ్ సీఐ శ్రీనివాసులు వెల్లడించారు.

Last Updated : Apr 21, 2024, 5:40 PM IST

ABOUT THE AUTHOR

...view details