325 మద్యం సీసాలు స్కానింగ్ - ఎస్ఈబీ అధికారులకు చిక్కిన అధికారి - illegal liquor seized - ILLEGAL LIQUOR SEIZED
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 19, 2024, 3:23 PM IST
Illegal Liquor Case Mangalagiri Guntur District : గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా ప్రభుత్వ మద్యం దుకాణంలో ఉద్యోగి చేతివాటం ప్రదర్శించారు. దామోదర్ రెడ్డి అనే ఉద్యోగి తన పేరుతో 325 మద్యం సీసాలను స్కానింగ్ చేసి పక్కన పెట్టుకున్నట్లు అధికారులకు ఎవరో సమాచారం అందించారు. దీంతో అధికారులు అతని ఇంట్లో సోదాలను నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగి స్కానింగ్ చేసిన మద్యం సీసాలను సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
శుక్రవారం మంగళగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిని మురుగుడు లావణ్య నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో ఈ మద్యం సీసాలను భద్రపరిచినట్లు ఉద్యోగి వెల్లడించినట్లు సమాచారం. ఈ ఘటనపై సెబ్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను విచారణ చేసిన అనంతరం మీడియాకి వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఎవరు అక్రమంగా మద్యం నిలువ ఉంచిన వారిని అరెస్టు చేసి తీరుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు.