మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భర్త దారుణం - భార్యపై గొడ్డలితో దాడి - Husband attack on wife
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 1, 2024, 10:52 PM IST
Husband Attacked With Axe On Wife: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం సేవించడానికి డబ్బులు అడిగితే ఇవ్వలేదనే కోపంతో వెంకటేశ్వర్లు తన భార్య అచ్చమ్మపై దాడికి పాల్పడ్డాడు. మద్యానికి బానిసైన భర్త అచ్చమ్మను డబ్బులు అడగగా ఇవ్వకపోవడంతో గొడ్డలితో దాడి చేశాడు. చెల్లెలుపై దాడి చేయడం చూసిన ఆమె సోదరులు దేవరకొండ జోష్, శీనులు వెంకటేశ్వర్లును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అడ్డుగా వచ్చిన వారిపై కూడా వెంకటేశ్వర్లు గొడ్డలితో దాడికి దిగాడు.
దీంతో వారు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బావమరిదిలపై గొడ్డలితో దాడి చేసిన అనంతరం వెంకటేశ్వర్లు అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ వారిని స్థానికులు గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మద్యం తాగేందుకు డబ్బులు అడిగితే ఇవ్వలేదని తనపై దాడికి పాల్పడినట్లు అచ్చమ్మ పోలీసులకు చెప్పింది. వెంకటేశ్వర్లును అడ్డుకునేందుకు వచ్చిన తన కొడుకుపై కూడా దాడికి పాల్పడ్డాడని అచ్చమ్మ తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అనంతపురంలో అన్న చెయ్యిని తమ్ముడు నరికిన ఘటన చోటు చేసుకుంది. కల్యాణదుర్గం మండలం ఎగువతండాలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. రూ.200 కోసం మద్యం మత్తులో తమ్ముడు శివశంకర్ నాయక్ అన్న వెంకటేష్ నాయక్‌పై దాడి చేశాడు. కత్తితో చేయి నరికేశాడు. పరిస్థితి విషమించడంతో అనంతపురు ఆస్పత్రికి తరలించారు.