ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎమ్మెల్యే కోటంరెడ్డిని అడ్డుకున్న సీఐ- మంత్రి నారాయణ ప్రత్యేక సమావేశంలో ఉద్రిక్తత - High Tension in Nellore Corporation - HIGH TENSION IN NELLORE CORPORATION

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 1, 2024, 5:42 PM IST

High Tension in Special Meeting Organized by Municipal Minister Narayana at Nellore Corporation : నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. సమావేశానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన అనుచరులతో వస్తుండగా నాలుగో పట్టణ సీఐ అల్తాఫ్‌ హుసేన్‌ అడ్డుకోవడంతో వివాదం తలెత్తింది. కార్పొరేషన్‌ కమిషనర్‌ సంతకం ఫోర్జరీ అంశంపై మంత్రిని కలిసేందుకు ఎమ్మెల్యే వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే (MLA) అనుచరులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట చోటు చేసుకుంది. సీఐ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. తర్వాత ఘటనపై ఎమ్మెల్యే కోటంరెడ్డి అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు చర్యలు తీసుకుంటానని చెప్పారు. దీంతో సమస్య సద్దుమణిగింది. అనంతరం మంత్రి నారాయణతో (Minister Narayana) కలిసి ఎమ్మెల్యే కోటంరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details