ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పేదలు, చిన్న పిల్లలకు ఉచిత వైద్యం: సద్గురు శ్రీ మధుసూదన సాయి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 26, 2024, 7:20 PM IST

Free Treatment For Poor Woman And Child in Silicon Andhra Hospital: మనిషి ఆనందంగా జీవించాలంటే ఆరోగ్యం చాలా అవసరమని అందుకే పేదలు, చిన్న పిల్లలకు సాయి ఆరోగ్య వైద్యాలయం ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందిస్తారని సద్గురు శ్రీ మధుసూదన సాయి పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కూచిపూడిలోని రవి ప్రకాష్ సిలికాన్ ఆంధ్ర సంజీవని వైద్యాలయానికి సద్గురు శ్రీ మధుసూదన సాయి ఇనిస్టిట్యూట్​ ఆఫ్ మెడికల్ సైన్సెస్​ మరియు రీసెర్చ్ వారి సహకారంతో ఇక నుంచి పూర్తి ఉచితంగా చిన్న పిల్లలు, మహిళలకు ఆరోగ్య సేవలు అందించనున్నట్టు సిలికాన్​ ఆంధ్రా వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభట్ల ఆనంద్ తెలియజేశారు. ఈరోజు సద్గురు సాయిచే సాయి ఆరోగ్యను (sai Arogya) ప్రారంభించారు. 

మానవ సేవే మాధవ సేవ అని సాయి ఆరోగ్య ద్వారా వైద్య సౌకర్యాలు మెరుగుపరిచి ప్రజలకు సేవ చేస్తామని కార్యక్రమానికి విచ్చేసిన మధుసూదన్ సాయి తెలిపారు. సత్యసాయి బాబా ఆశీస్సులు, అనుగ్రహంతో వైద్య కార్యక్రమాల్లో ముందుంటామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతంలో ఇటువంటి వైద్యశాలను కట్టడం చాలా సంతోషకరమని, వైద్య సేవలను చుట్టుపక్కల గ్రామీణ ప్రజలు వినియోగించుకోవాలని తెలియజేశారు. సిలికాన్ ఆంధ్ర సంజీవిని వైద్యాలయం ప్రారంభించి ఇప్పటికి ఐదు సంవత్సరాలు అయినా పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోయామని ఇప్పటినుంచి చిన్నపిల్లలు మరియు మహిళలకు అత్యాధునిక వైద్య పరికరాలతో(Advanced medical equipment) ఉచితంగా వైద్యం అందిస్తామని ఆనంద్ పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details