ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'రాజధాని ఫైల్స్‌' సినిమా నిలిపివేత - నిరసనకు దిగిన రైతులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 15, 2024, 5:40 PM IST

Published : Feb 15, 2024, 5:40 PM IST

Farmers Protest After Rajdhani Files Movie Stopped: రాజధాని ఫైల్స్ సినిమా విడుదలపై హైకోర్టు స్టే ఇచ్చిన ఆర్డర్ కాపీ రాకముందే జగన్ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినిమా ధియేటర్లపైకి అధికారులను ఉసిగొల్పింది. తక్షణం సినిమా ప్రదర్శనలు ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్థానికంగా ఉన్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది థియేటర్లకు వెళ్లిన షోను అర్ధంతరంగా ఆపేశారు. 

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో రాజధాని ఫైల్స్ సినిమాను ఆపేయడంతో రైతులు నిరసన తెలిపారు. రాజధాని ఫైల్స్ సినిమా చూసేందుకు ఉదయం ఆటకు రైతులు టిక్కెట్లు కొనుగోలు చేశారు. హైకోర్టు ఉత్తర్వులతో సినిమాను అపేస్తున్నట్లు ధియేటర్ యాజమాన్యం ప్రకటించింది. అప్పటికే సినిమాను తిలకించేందుకు రాజధాని ప్రాంత రైతులు భారీగా టిక్కెట్లు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులు రోడ్డెక్కి ఉండవల్లి కూడాలిలో ధర్నా నిర్వహించారు. మరో వైపు తుళ్లూరులో సినిమాను తిలకించేందుకు రైతులు భారీగా తరలివచ్చారు. ధియేటర్ వద్ద బాణసంచా కాల్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సినిమా లేదని రైతులు చెప్పారు. రాజధానిలో రైతులు పడుతున్న ఇబ్బందులను సినిమా రూపంలో తీసుకువచ్చారని రైతులు చెప్పారు. 

ABOUT THE AUTHOR

...view details