ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పొలం పనులు చేస్తూ అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి రైతులు - Farmer laborers Unconscious - FARMER LABORERS UNCONSCIOUS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 18, 2024, 6:10 PM IST

Farmer Laborers Unconscious in East Godavari : వరి పొలంలో గుళికలు చల్లుతూ వాంతులు చేసుకొని వ్యవసాయ కూలీలు అస్వస్థతకు గురైన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. బిక్కవోలు మండలం పందలపాక గ్రామానికి చెందిన శ్రీధర్​ నారాయణ రెడ్డి అనే రైతు పొలంలో సుమారు పది మంది వ్యవసాయ కూలీలు వరి పొలంలో గుళికలు చల్లేందుకు పనికి వెళ్లారు. కొంతమేర చల్లిన తరువాత ఓ రైతు తీసుకువచ్చిన మజ్జిగను తాగారు. అనంతరం యథావిధిగా పని చేయడం ప్రారంభించిన కొద్దిసేపటికే 8 మంది కూలీలు వాంతులు చేసుకొని అస్వస్థతకు గురయ్యారు.

దీన్ని గమనించిన రైతు వెంటనే అప్రమత్తమై 108కు సమాచారం అందించారు. దీంతో వారిని రెండు అంబులెన్స్​లలో అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిక్షించిన వైద్యులు చికిత్స అందించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆసుపత్రికి చేరుకొని కూలీలను పరామర్శించారు. మజ్జిగా తాగినందున అస్వస్థతకు గురయ్యారా? లేదా రసాయనిక గుళికల వల్ల జరిగిందా? అనే విషయం తెలియాల్సి ఉందన్నారు. బాధితులకి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రస్తుతం కూలీల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details