ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

బాబు వచ్చారు- అమరావతిలో పని ఇచ్చారు! పొరుగు రాష్ట్రాల వలసకార్మికుల అడ్డాగా రాజధాని ప్రాంతం - CONSTRUCTION WORKERS HOPES ON GOVT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 3, 2024, 2:22 PM IST

Construction Workers Hopes on TDP Government In Vijayawada : ఉపాధి కోసం విజయవాడకు వచ్చిన వలస కార్మికులు గత ఐదేళ్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అవలంబించిన విధానాలతో  ఇబ్బందులు పడ్డారు. నూతన ఇసుక విధానంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు మందగించి పనుల్లేక పస్తులున్నారు. కూటమి ప్రభుత్వం రాకతో వారిలో మళ్లీ ఆశలు చిగురించాయి. అమరావతి పనులతో పాటు నిర్మాణ రంగం పుంజుకుంటే చేతినిండా పని దొరుకుతుందని వారంతా భావిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి విజయవాడకు పని కోసం వచ్చిన కార్మికులు కూటమి ప్రభుత్వం పై ఆశలు పెట్టుకున్నారు.

అమరావతి పనులతో పాటు నిర్మాణ రంగం పుంజుకుంటే చేతినిండా పని దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వలస కార్మికుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేసి అమలు చేయాలని కోరుతున్నారు. పని చేస్తున్న క్రమంలో  వారికి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం నుంచి ఆర్థిక తోడ్పాటు ఉండాలని ఆశిస్తున్నారు. త్వరగా అమరావతిని మొదలు పెట్టి అందులో తమకు పని కల్పించాలంటున్న వలస కార్మికులతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి
 

ABOUT THE AUTHOR

...view details