ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పనుల్లో వేగం పెరిగి ఉపాధి లభిస్తుంది - ఉచిత ఇసుక పాలసీపై కార్మికుల ఆనందం - Construction workers Full Happy - CONSTRUCTION WORKERS FULL HAPPY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 10, 2024, 12:46 PM IST

Construction Workers Happy On Free Sand policy : ఉచిత ఇసుక పాలసీపై భవన నిర్మాణ కార్మికులు, వలస కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా పనులు లేక సొంత గ్రామాలకు వెళ్లామని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక అమలు చేయటంతో పనులు మెుదలవుతాయని కార్మికులు తెలిపారు. ఇక నుంచి తమకు చేతినిండా పని దొరికి సంతోషంగా ఉంటామని కూలీలు ఆనంద పడుతున్నారు. సరైన పని లేక జీవనాధారం లేక, ఐదేళ్లు అవస్థలు పడ్డామని తెలిపారు. చంద్రబాబు నాయుడు పాలనలో తమకు మంచి జరుగుతుందని కూలీలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక విధానంతో తమ జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. పనులు వేగం పుంజుకుని రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనుల్లో ఉపాధి దొరుకుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఇన్నేళ్ల కష్టాలకు తెరపడ్డాయని కార్మికులు అన్నారు. నెల్లూరులోని భవన నిర్మాణ పనులకు వెళ్తున్న కార్మికులతో ఈటీవీ ప్రతినిధి రాజారావు ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details