ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: గురజాలలో చంద్రబాబు "రా కదలిరా" బహిరంగ సభ - ప్రత్యక్ష ప్రసారం - చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 2, 2024, 4:18 PM IST

Updated : Mar 2, 2024, 8:06 PM IST

TDP Chandrababu Raa kadali Ra Meeting at Dachepalli Live: టీడీపీ రా కదలిరా సభలతో తెలుగు దేశం శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగుతుండగా ఇదే సమయంలో వైఎస్సార్సీపీలో రాజీనామాల పర్వం ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇవాళ నెల్లూరు, పల్నాడు జిల్లాల్లో రా కదలి రా సభలు జరగుతుండగా, వైఎస్సార్సీపీ నేతలు పెద్ద ఎత్తున చంద్రబాబు సమక్షంలో సైకిలెక్కుతున్నారు. నెల్లూరులో సభ తర్వాత హెలికాఫ్టర్‌లో చంద్రబాబు దాచేపల్లి చేరుకున్నారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో (Dachepalli) జరిగే రా కదిలిరా సభలో పాల్గొన్నారు. ఈ సభా వేదికగానే టీడీపీలో చేరనున్నట్లు లావు కృష్ణదేవరాయలు ఇప్పటికే ప్రకటించారు. పల్నాడు అభివృద్ధి కోసం ప్రజలకు తనకు మద్దతివ్వాలని కోరారు. దాచేపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ రా కదలిరా సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. నరసరావుపేట పార్లమెంటరీ పరిధిలోని తెలుగుదేశం - జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. దాచేపల్లిలో చంద్రబాబు 'రా కదలిరా' సభ ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Mar 2, 2024, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details