ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE : రాయచోటిలో చంద్రబాబు ప్రజాగళం బహిరంగసభ - ప్రత్యక్ష ప్రసారం - CBN PRAJAGALAM LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 2, 2024, 5:24 PM IST

Updated : May 2, 2024, 6:20 PM IST

Chandrababu Prajagalam public meeting live in Rayachoty : అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రజాగళం సభలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కూటమి మేని ఫెస్టోపై ప్రజల్లో మంచి స్పందన వచ్చిందన్నారు. ఇక కూటమి విడుదల చేసిన మేని ఫెస్టో గమనించినట్లైతే, బీసీలకు రక్షణ చట్టం, బీసీ సబ్‌ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో లక్షన్నర కోట్ల ఖర్చు, స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్, చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపడం, బీసీల స్వయం ఉపాధికి ఐదేళ్లలో 10 వేల కోట్ల వ్యయం, 5 వేల కోట్లతో ఆదరణ పథకం, చేనేత కుటుంబానికి ఏడాదికి 24 వేల ఆర్థిక సాయం, దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు 25 వేల వేతనం వంటి అనేక విశేష నిర్ణయాలను మేనిఫెస్టోలో ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్‌ వంటి చరిత్రాత్మక నిర్ణయాలు ప్రజల్లోకి బలంగా వెళ్లనున్నాయి. అలాగే ఇప్పటికే అందుకుంటున్న పింఛన్‌ను ఏప్రిల్ నుంచే 4 వేల రూపాయలకు పెంచడం ప్రజలకు మరింత దగ్గర చేయనుంది. ఇప్పటికే 66 లక్షల మంది పింఛన్‌దారులు ఉండగా 50 ఏళ్లకే పింఛన్‌ వర్తింపు ద్వారా మరి కొన్ని లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం రాయచోటి ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : May 2, 2024, 6:20 PM IST

ABOUT THE AUTHOR

...view details