ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'ప్రేమలో మోసపోయాను'- యువకుడి ఆత్మహత్య సెల్ఫీ వీడియో వైరల్​ - LOVE FAILURE - LOVE FAILURE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2024, 4:45 PM IST

A Young Man Deceived in Love Committed Suicide by Hanging Himself : ఓ అమ్మాయిని ప్రేమించి మోసపోయానని జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకరమైన ఘటన కర్నూలులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జులకల్ గ్రామానికి చెెందిన అశోక్(24) అనే యువకుడు కర్నూలు నగరంలోని కొత్త బస్తాండ్ సమీపంలో ఉన్న ఓ లాడ్జ్ ​లో గదిని అద్దెకు తీసుకున్నాడు. ప్రేమలో మోసపోయానని, ఎవరూ ప్రేమించవద్దంటూ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపారు. ఒక అమ్మాయిని 8 సంవత్సరాలుగా గాఢంగా ప్రేమించానని వెల్లడించాడు. చివరికి మోసపోయానని వాపోయాడు. 

ప్రేమికురాలి నాన్న కానిస్టేబుల్​గా విధులు నిర్వర్తిస్తున్నారని, తన పరిచయాలతో సీఐ స్థాయి వ్యక్తుల నుంచి బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపాడు. ఏ అమ్మాయిని కూడా గాఢంగా ప్రేమించరాదని సెల్ఫీ వీడియోలో తన బాధను వ్యక్తపరిచాడు. చివరికి బరువెక్కిన గుండెతో అక్కడే ఉన్న ఫ్యాన్​కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన లాడ్జ్ సిబ్బంది వెంటనే నాలుగో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అశోక్ మృత దేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మెుదలు పెట్టారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details