ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఘోర వైఫల్యం'- టీడీపీ నాయకులు - TDP Leaders Reacted elections

TDP Leaders Reacted on Defeat of YSRCP in Assembly Elections 2024 : ఏపీ సార్వత్రిక ఎన్నికల కూటమి అభ్యర్థులకు అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు నాయకులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఘోర వైఫల్యం వల్లే గెలిచామని వెల్లడించారు. అభివృద్ధి, ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సత్తా చంద్రబాబుకు మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు.

tdp_leaders_respond
tdp_leaders_respond (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 6, 2024, 9:37 AM IST

'రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఘోర వైఫల్యం'- టీడీపీ నాయకులు (ETV Bharat)

TDP Leaders Reacted on Defeat of YSRCP in Assembly Elections 2024 :హామీలను నిలబెట్టుకోవడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఫల్యం చెందడంవల్లే ఎన్డీఏకు రికార్డు స్థాయిలో మెజార్టీ వచ్చిందని కూటమి నేతలు అన్నారు. అన్ని విధాలుగానూ నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే సత్తా చంద్రబాబుకు ఉందన్నారు. 24 గంటలూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తామని నేతలు హామీ ఇచ్చారు.

Machilipatnam MLA Kollu Ravindra : 50 వేలతో అఖండ మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గ ప్రజలకు మచిలీపట్నం కూటమి విజేత కొల్లు రవీంద్ర ధన్యవాదాలు తెలిపారు. గత పాలకులు అస్థవ్యస్థంగా మార్చిన బందరు పోర్టు నిర్మాణ పనులపై పునః సమీక్షించి పూర్తి స్థాయిలో పనులు జరిగేలా కృషి చేస్తామన్నారు. తనను నమ్మి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయనని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

'ప్రజల తీర్పు నిశ్శబ్ద విప్లవం'- వైఎస్సార్సీపీ ఘోర పరాజయంపై టీడీపీ స్పందన - TDP LEADERS REACTION

Gannavaram MLA Yarlagadda Venkatarao :చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా తీసివేయాలని గతంలో జగన్ ప్రయత్నిచారని గన్నవరం కూటమి విజేత యార్లగడ్డ వెంకట్రావు ఆరోపించారు. కానీ ఇప్పుడు ఆయనకే ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు పడిన కష్టాన్ని గుర్తుంచుకునే ప్రజలు కూటమికి పట్టం కట్టారని వినుకొండ ఎమ్మెల్యేగా ఎన్నికైన జీవీ ఆంజనేయులు అన్నారు.
TDP Leader Gandhi Babji :బటన్‌లు నొక్కడం తప్ప ఐదేళ్లలో జగన్‌ చేసిన అభివృద్ధి శూన్యమని విశాఖ టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జి, ఎమ్మెల్సీ డాక్టర్ వేపాడ చిరంజీవి మండిపడ్డారు. రానున్న రోజుల్లో చంద్రబాబు ప్రజాపాలన అందిస్తారని, మళ్లీ రాష్ట్రాన్ని గాడిలో పెడతారని కాకినాడ గ్రామీణ టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయానికి సహకరించిన ప్రజలందరికీ కర్నూలు జనసేన నాయకులు చింతా సురేష్ ధన్యవాదాలు తెలిపారు. కూటమి అనూహ్య విజయం - హర్షం వ్యక్తం చేస్తున్న నాయకులు - Tdp Leaders On Victory

Kamalapuram MLA Putta Chaitanya Reddy : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఈవీఎంలపై నెపాన్ని నెట్టేస్తున్నారని కమలాపురం టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పుత్తా చైతన్యరెడ్డి మండిపడ్డారు. ప్రజలపై అభాండాలు వేయడం సరికాదని ధ్వజమెత్తారు.

చంద్రబాబును కలవడానికి పోటీపడుతున్న అధికారులు, నాయకులు - Govt Officers Meet Chandrababu

ABOUT THE AUTHOR

...view details