Several People Dead in Road Accident at East Godavari District: ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే ప్రధాన రహదారి రక్తసిక్తమైంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మినీలారీ రూపంలో మృత్యువు ఏడుగురు కార్మికులను బలితీసుకుంది. ఈ దుర్ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు మినీలారీ బయలుదేరింది. ఆరిపాటిదిబ్బలు-చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో అదుపుతప్పి పంటబోదెలోకి మినీలారీ దూసుకెళ్లి తిరగబడింది. ఆ సమయంలో వాహనంలో డ్రైవర్‌తో పాటు 9 మంది కార్మికులు ఉన్నారు. సంఘటన అనంతరం డ్రైవర్ తప్పించుకుని పరారయ్యాడు.
నంద్యాల జిల్లాలో పండుగపూట విషాదం - రోడ్డు ప్రమాదంలో తల్లీ, కుమారుడి మృతి
జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకుని :మినీలారీ తిరగబడిన సమయంలో జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకుని ఏడుగురు కార్మికులు చనిపోయారు. స్థానికులు సకాలంలో స్పందించి పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ దేవకుమార్, ఎస్సైలు శ్రీహరిరావు, సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకున్న వారిని వెలికితీశారు. సంఘటనలో గాయపడిన వారిలో ఒకరిని ఘంటా మధుగా పోలీసులు గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.
మృతులు వీరే :సమిశ్రగూడెం మండలం తాడిమళ్లకు చెందిన దేవాబత్తుల బూరయ్య (40), తమ్మిరెడ్డి సత్యనారాయణ (45), పి.చినముసలయ్య (35), కత్తవ కృష్ణ (40), కత్తవ సత్తిపండు (40), తాడి కృష్ణ (45), నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికి చెందిన బొక్కా ప్రసాద్‌గా పోలీసులు వెల్లడించారు.