Rottela Panduga Celebrations Second Day : నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ కోలహలంగా సాగుతోంది. రెండోరోజు రొట్టెల పండుగ సందడిగా జరుగుతోంది. భారీగా తరలివచ్చిన భక్తులతో దర్గా ప్రాంగణం జన సముద్రమైంది. గంధ మహోత్సవానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేయగా వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. బారాషాహీద్ సమాధులను దర్శించుకుంటున్న భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు.
Nellore Rottela Festival 2024 :కోరికల రొట్టెలు ఇచ్చి, పుచ్చుకునే స్వర్ణాల చెరువు భక్తులతో కిటకిటలాడుతోంది. కోర్కెలు నెరవేరిన వారు రొట్టె వదులుతుంటే, అదే కోరిక కోరుకునేవారు వాటిని పట్టుకుంటున్నారు. చదువు, ఉద్యోగం, సౌభాగ్యం, వ్యాపారం, ఇల్లు, ఆరోగ్యం, పెళ్లి, సంతానం ఇలా రకరకాల రొట్టెలను భక్తులు మార్చుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వర్ణాల చెరువులో స్నానాలు ఆచరిస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు. రొట్టెల పండుగలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. దర్గా ప్రాంగణంలో అపరిశుభ్రతకు తావు లేకుండా కార్పొరేషన్ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు.
నెల్లూరులో రొట్టెల పండుగ - భారీగా తరలివచ్చిన భక్తులు - Nellore Rottela Panduga