Road Accident in Guthi Anantapur Distirct :పెళ్లి వస్త్రాల కోసం హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం అనంతపురంలోని రాణినగర్‌కు చెందిన ఏడుగురు హైదరాబాద్ నుంచి అనంతపురం జిల్లాకు కారులో బయలుదేరారు. గుత్తికి 4 కిలోమీటర్ల దూరంలో రాయల్ దాబా వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ కారును ఢీకొట్టింది.
పల్నాడు జిల్లాలో బస్సు-టిప్పర్ ఢీ - ఆరుగురు దుర్మరణం - PALNADU ROAD ACCIDENT TODAY
ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనాస్థలిలోనే మృతి చెందారు. మరో ఇద్దరు గుత్తి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతులను అల్లీ సాహెబ్ (58), షేక్ సురోజ్‌బాషా(28) మహ్మద్ అయాన్(6), అమాన్(4), రెహనాబేగం(40)గా గుర్తించారు. షేక్ సురోజ్ బాషా వివాహం ఈ నెల 27న జరగనుంది. పెళ్లి వస్త్రాల కొనుగోలు కోసం హైదరాబాద్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనపై గుత్తి సీఐ వెంకట్రామిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ నిద్ర మత్తే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
మృత్యువు వెంటాడటం అంటే ఇదేనేమో - ఒక ప్రమాదం నుంచి బయటపడిన నిమిషాల్లోనే - మరో యాక్సిడెంట్లో! - Zaheerabad Techi Died In USA
విలేఖరి ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ : సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన వైఎస్సార్ జిల్లా ముద్దనూరులో జరిగింది. జమ్మలమడుగు వైపు నుంచి ముద్దనూరు వైపు వెళ్తున్న లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో రైల్వే గేటును ధ్వంసం చేసుకుంటూ ఓ విలేకరి ఇంట్లోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్రేన్ సహాయంతో లారీని బయటకు తీసేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేదు. లారీని బయటికి తీసుకొస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.
ఏడుగురికి తీవ్ర గాయాలు : నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం టపాతోపు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఢీకొని కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు బాపట్ల జిల్లా కాజుపాలెంకు చెందినవారిగా గుర్తించారు. బ్రహ్మంగారిమఠం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో అటుగా వెళ్ల్తున్న మెడికల్ విద్యార్థిని ప్రాథమిక చికిత్స అందించి 108 ద్వారా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
హైవేపై వరుసగా ఢీకొన్న కార్లు- ప్రయాణికులు సేఫ్ - Road Accident in NTR District