ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నడుస్తున్న బస్సులో దారుణం-తెలంగాణలో ఒకే రోజు రెండు అత్యాచార ఘటనలు - Rape Incidents in Telangana - RAPE INCIDENTS IN TELANGANA

Rape in Hyderabad : తెలంగాణలో ఒకే రోజు రెండు అత్యాచార ఘటనలు సంచలనం రేపాయి. మహిళల భద్రత కోసం పోలీసులు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే బాధిత మహిళల ఫిర్యాదులతో, నగరంలో జరిగిన రెండు వేర్వేరు ఘటనలు వెలుగుచూశాయి. ఒకరు రన్నింగ్​ బస్సులో అత్యాచారానికి గురైతే, మరొకరు స్నేహం ముసుగులో బలయ్యారు.

RAPE INCIDENTS IN TELANGANA
RAPE INCIDENTS IN TELANGANA (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 30, 2024, 10:00 PM IST

Rape Incident in Telangana : మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహిళలను ఒంటరిగా చూస్తే చాలు, వారిపై దౌర్జన్యాలకు, అత్యాచారాలకు కొందరు కీచకులు పాల్పడుతున్నారు. ఈ నేరాలను అరికట్టేందుకు సర్కార్​ కఠిన చర్యలు తీసుకుంటున్నా, నేరాలు మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన మరో రెండు దారుణాలు బాధితుల ఫిర్యాదులతో వెలుగుచూశాయి.

కదులుతున్న బస్సులో మహిళపై రేప్:కదులుతున్న బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిర్మల్ జిల్లా నుంచి ప్రకాశం వెలుతున్న మహిళపై ఆఘాయిత్యం జరిగింది. నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్‌ తనపై అత్యాచారం చేశాడని డయల్‌ 100 ద్వారా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేడ్చల్ సమీపంలో బస్సు ఉండగా మహిళ ఫిర్యాదుతో, సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు కోసం గాలింపు చర్యలు చేపట్టి, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి రాగానే బస్సును చేజ్ చేసి పట్టుకున్నారు. కాగా డ్రైవర్ కృష్ణ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. మరో డ్రైవర్ సిద్దయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వివరించారు.

సాఫ్ట్​వేర్ ఇంజినీర్​పై స్నేహితుల అత్యాచారం : హైదరాబాద్​లో మరో దారుణ ఘటన సైతం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్​వేర్ ఇంజినీర్​పై స్నేహితుడు అత్యాచారం చేసిన ఉదంతం బాధితురాలి ఫిర్యాదుతో బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,హైదరాబాద్​కు చెందిన ఓ మహిళా సాఫ్ట్​వేర్ ఇంజినీర్ తన ఫ్రెండ్స్​తో కలిసి ఓ హోటల్​కు వెళ్లారు.

అప్పటికే బాధితురాలు మత్తులో ఉండటంతో కొంత సమయం అనంతరం స్పృహ వచ్చిన వెంటనే చిన్ననాటి స్నేహితుడితో పాటు మరో వ్యక్తి రూమ్​లో ఉండగా బాధితురాలు భయాందోళనకు గురైనట్లు వివరించారు. దాంతో ఆమె అరవడంతో హోటల్ సిబ్బంది రూమ్​కు వెళ్లడంతో అక్కడ ఉన్న ఇద్దరు పరారయ్యారు. వెంటనే బాధితురాలు తన స్నేహితులకు విషయం తెలపడంతో హోటల్ సిబ్బంది, బాధితురాలిని స్థానికంగా ఉన్న హాస్పిటల్​కు తరలించి వైద్యం అందించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న వనస్థలిపురం పోలీసులు పరారీలో ఉన్న ఇద్దరు కొరకు సీసీ కెమెరాలలో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు.

హైదరాబాద్​లో దారుణం - సాఫ్ట్​వేర్ ఇంజినీర్​పై స్నేహితుల అత్యాచారం

న్యాయ విద్యార్థుల దారుణం - యువతిపై అత్యాచారం చేసిన భర్త - వీడియో తీసిన భార్య - law student raped in Tirupati

ABOUT THE AUTHOR

...view details