Police Registered Case Against Kodali Nani on Complaint of Volunteers:కృష్ణా జిల్లా గుడివాడ వార్డు వాలంటీర్ల ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి కొడాలి నాని, ఆయన సన్నిహితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సమావేశాలు నిర్వహించి తమపై ఒత్తిడి చేయటం, వైఎస్సార్సీపీ నేతలు మళ్లీ మళ్లీ ఫోన్లు చేస్తున్న నేపథ్యంలో బలవంతంగా తమను రాజీనామా చేయించారంటూ పలువురు వార్డు వాలంటీర్లు గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వాలంటీర్ల ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి కొడాలి నాని, ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను తదితర నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కొడాలి నానితో సహా వైఎస్సార్సీపీ నేతలపై 447, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
బెదిరించి రాజీనామా చేయించారు- గుడివాడ వైసీపీ నేతలపై మాజీ వాలంటీర్ల ఫిర్యాదు - EX Volunteers Complaint YCP Leaders
వైఎస్సార్సీపీ నేతల బెదిరింపులు తాళలేక రాజీనామా చేసిన వాలంటీర్లు ఇప్పుడు మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు బెదిరించడంతో గత్యంతరం లేక చాలా మంది రాజీనామా చేశారు. ఏపీలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో వారంతా బయటకు వచ్చి వైఎస్సార్సీపీ నేతల బెదిరింపులపై ప్రస్తుతం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. గుడివాడ మాజీ వాలంటీర్లు వైసీపీ నాయకులపై వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత తాము రాజీనామా చేయాలని ఒకటికి పది సార్లు ఫోన్లు చేసి వేధించారని మాజీ వాలంటీర్లు తెలిపారు. తమ ఇళ్లకు వచ్చి బెదిరింపులకు పాల్పడుతూ తమ చేత ఈ విధంగా చేయించారని ఆరోపించారు. ఇప్పుడు తమకు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తుంటే వైఎస్సార్సీపీ నేతలు పారిపోతున్నారని అన్నారు. అదేవిధంగా తమను తిరిగి విధుల్లోకి తీసుకొని తమ కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కోరుతున్నట్లు మాజీ వాలంటీర్లు చెప్పారు.
వైసీపీ నేతల మాటలు విని రాజీనామా చేశాం- గ్రామ వాలంటీర్లు ఆవేదన - Volunteers Deposed To YSRCP leaders
గుడివాడ వైఎస్సార్సీపీ కార్యాలయ భవనంపై టీడీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. శరత్ థియేటర్లో ఎనిమిది సంవత్సరాల క్రితం వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని మాజీ మంత్రి కొడాలి నాని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. థియేటర్ కాళీ చేయాలని భాగస్వామ్యులు అనేక సార్లు విజ్ఞప్తి చేశారు. భాగస్వామ్యులపై మాజీ మంత్రి కొడాలి నాని బెదిరింపులకు దిగారు. దీంతో థియేటర్ భాగస్వామి అయిన గుడివాడ మున్సిపల్ మాజీ చైర్మన్ యాలవర్తి యువసేన చంద్రన్న అసెంబ్లీలోకి పునరాగమనం కానున్న పేరుతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
వాలంటీర్లు రివర్స్ - వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు - Volunteers Filed Police Case on YCP