ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు రోజుల పోలీసు కస్టడీకి 'వర్రా' - POLICE INTERROGATING TO VARRA

ప్రస్తుతం కడప జైల్‌లో రిమాండ్ ఖైదీగా ఉన్న వర్రా రవీందర్‌రెడ్డి - రెండు రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ

Police interrogating To Varra Ravindra Reddy For Two Days Custody
Police interrogating To Varra Ravindra Reddy For Two Days Custody (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 8, 2025, 2:01 PM IST

Police interrogating To Varra Ravindra Reddy For Two Days Custody :వివేకా కుమార్తె సునీతతోపాటు షర్మిల, విజయమ్మ, చంద్రబాబు, లోకేశ్, పవన్ పై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన పులివెందులకు చెందిన వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కడప కోర్టు అనుమతితో రెండ్రోజుల కస్టడీలో భాగంగా పులివెందుల పోలీసులు కడప జైలులో ఉన్న రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని కోర్టు ఆదేశాల మేరకు ఉదయం 9 గంటలకే పోలీసులు వర్రాని అదుపులోకి తీసుకున్నారు.

జైలు నుంచి నేరుగా రిమ్స్​కి వెళ్లి వైద్య పరీక్షలు పూర్తిచేసుకుని కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్​కి తీసుకొచ్చారు. అనంతరం వర్రా రవీందర్ రెడ్డిని పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ ప్రశ్నిస్తున్నారు. న్యాయవాది ఓబుల్ రెడ్డి సమక్షంలో కడప సైబర్ క్రైమ్ పీఎస్‌లో వర్రాను విచారిస్తున్నారు. వర్రా పై జిల్లాలో 10 కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా 40 కేసులు నమోదయ్యాయి. నవంబర్ 8న వర్రా రవీందర్​రెడ్డిపై నమోదైన అట్రాసిటీ కేసులో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో అధికార పార్టీ నేతలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టడానికి కుట్ర దారులు ఎవరనేదానిపై లోతుగా విచారించడానికి వర్రా రవీందర్​రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు ప్రశ్నించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details