New Year 2025 Planning : కాల చక్రంలో మరో కొత్త సంవత్సరం రాబోతుంది. మరి కొద్ది రోజుల్లో 2024వ సంవత్సరం వెళ్లిపోతోంది. ఒక ఏడాది అంటే 365 రోజులు అని కాకుండా 365 అవకాశాలుగా భావించి అదును చూసి సద్వినియోగం చేసుకోవాలి. చేయాలనుకున్నపుడే ప్రారంభించి, సాధించాలనుకున్న పనికి వెంటనే పునాదులు వేయాలి. ప్రతి క్షణం జీవితంలో ఆనందంతో గడపాలంటే ప్రణాళికతోపాటు ముందుకు నడిపే దిక్సూచి అవసరం.
పెద్ద కంపెనీ కారైనా, ఇంజిన్ శక్తిమంతమైనా, రోడ్డు అద్భుతంగా ఉన్నా, దట్టమైన పొగమంచు కమ్ముకొని ఉంటే ప్రయాణం మెల్లగా సాగాల్సిందే. అదే విధంగా ప్రణాళికలు లేని జీవితాలు కూడా అంతే. ప్రణాళికలతో జీవితం కొనసాగిస్తే జీవితం అందరికీ సుఖసంతోషాలకు వేదికే.
దేశానికే కాదు మన ఇంటికీ బడ్జెట్ రూపొందించుకోవాలి. ఖర్చుపెట్టే ప్రతి రూపాయికీ లెక్క రాసుకోవడంతో పాటు ఈ సంవత్సరం సాధించాల్సిన లక్ష్యాలు, వాటి ఖర్చులు అంచనా వేసుకోవాలి. ఎంత ఆదా చెయ్యాలో ప్రణాళికను రూపొందించుకుని ఆదాయాన్ని మించిన ఖర్చు అనే ఆలోచన రాకుండా చూసుకోవాలి.
ఎప్పుడు ఏ ఆపద వస్తుందో? ఎప్పుడు ఏ అవసరం పడుతుందో ఎవరికి తెలుసు? ఉన్నట్టుండి అడిగితే డబ్బులు ఇచ్చేవారూ అరుదే. ఆ పరిస్థితుల్లో ఆదుకోడానికి కొంత నగదు సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ మేరకు ప్రతినెలా ఎంతో కొంత ఆదా చేయాలి.
ఉద్యోగ విరామ అనంతర ప్రణాళిక 50 ఏళ్లు దాటాక ఆలోచించేది కాదు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచే రిటైరయ్యే నాటికి ఎంత నగదు ఉండాలో ఆలోచించుకోవాలి. చిన్న వయసులోనే మదుపు మొదలెడితే తక్కువ కాలంలో ఎక్కువ జమవుతుంది.
జీవిత బీమా ప్రతి ఒక్కరికీ ధీమానిస్తుంది. బైక్, కారు, ఇల్లు, ఆరోగ్య, జీవిత బీమాలను తక్షణం సరిచూసుకోండి. వయసు మళ్లిన కొద్దీ బీమా నిబంధనలు మారుతుంటాయి. వయసుకు తగ్గట్టు ఇన్స్యూరెన్స్ ఏజెంట్‌ను సంప్రదించి, అవసరాలకు అనుగుణంగా పాలసీ తీసుకోండి.
ఎనిమిది సూత్రాలను అమలు చేస్తే జీవితంలో ఆనందమంతా మీదే అని ప్రఖ్యాత రచయిత కుష్వంత్ సింగ్ అభిప్రాయం.
1.అసలైన సంపద అదే
ఆరోగ్యాన్ని నిజమైన సంపదగా భావించండి. మీకు ఎంత డబ్బున్నా ఆరోగ్యం సహకరించకుంటే మాత్రం జీవితాన్ని ఎప్పటికీ ఆస్వాదించలేరు.
2. బ్యాంక్ బ్యాలెన్స్
లక్షలకు లక్షలు ఆదాయం ఉండాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. మీ అవసరాలను తీర్చేంత కొంత ఉంటే చాలు. మనం అనుకున్న మంచి హోటల్లో తినడం, నచ్చిన ప్రదేశానికి వెళ్లి అక్కడి ప్రాంతాన్ని ఆస్వాదించడం, నచ్చిన సినిమాను చూడడం. ఇలాంటి సాకారమయ్యే కోరికలను సాకారం చేసుకోగలగాలి. చిన్న అవసరాలకు కూడా ఇతరుల దగ్గర చేయి చాచడం అంటే మనల్ని మనం తక్కువ చేసుకుని ఒప్పుకోవడమే అవుతుంది.
3. ఆ కల కోసం