People Suffering Due to Godavari Floods in Alluri District : అల్లూరి జిల్లా రంపచోడవరం మన్యం ప్రాంతంలో 15 రోజులుగా వర్షాలు తగ్గలేదు. వానల జోరుతో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాలు నిండుకుండల్లా మారాయి. సీతపల్లి వాగు, మడేరు వాగు, బొడ్లంక వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రాకపోకలు నిలిచిపోయాయి. దేవీపట్నం మండలం పాముగండి వెళ్లేదారిలో వరద పోటుతో ఓ ఆటో నిలిచిపోయింది. అందులోని ప్రయాణికులు వాగు దాటేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
చింతూరు, కూనవరం మండలాల్లోని వరద బాధిత ప్రాంతాల్లో కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటించారు. కూనవరం మండలంలోని భద్రాయగూడెం, తాళ్లగూడెంలలో పడవపై ప్రయాణించి వరద బాధితుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నిత్యావసరాలు, టార్చ్ లైట్లు తదితర సరుకులు వరద బాధితులకు అందజేశారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు, రాకపోకలకు పడవలు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. వరద బాధితులకు సహాయం చేయడానికి కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు
తగ్గని గోదావరి వరద ఉద్ధృతి - జలదిగ్బంధంలోనే లంక గ్రామాలు - Godavari floods in ap