Parking of YSRCP Leaders Vehicles At Guntur Mirchi Yard :గుంటూరు మిర్చి యార్డుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ రాకతో ఆ ప్రాంతంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఇష్టారాజ్యంగా వాహనాలను నిలిపివేయడంతో రైతులు అవస్థలు పడ్డారు. వాహనదారులు, సామాన్యులు ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
మిర్చియార్డులోకి సరకు తెచ్చే మిర్చిలోడు లారీలు, వ్యాన్లు రోడ్డుపైనే ఆగిపోయాయి. వాహనాలతో పాటు పంటలు అమ్ముకునేందుకు వచ్చిన రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మిర్చిలోడు లారీలు, వ్యాన్లు రోడ్డుపైనే నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
మిర్చి రైతులను కలిసిన జగన్ కూటమి సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.