Nara Lokesh Praja Darbar : వైఎస్సార్సీపీ నేతలు బెదిరిస్తున్నారని, మరి కొందరు తమ ఆస్తులను కాజేసేందుకు యత్నిస్తున్నారని పలువురు బాధితులు మంత్రి లోకేశ్ ఎదుట మొర పెట్టుకున్నారు. ఉండవల్లి నివాసంలో మంగళవారం (Sep 17) నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజలు నేరుగా లోకేశ్‌ను కలిశారు. వారి సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ఆయా సమస్యలు పరిష్కరిచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బాధితులకు తమకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చి ధైర్యం చెప్పారు.
Harassment of YSRCP leader :అప్పుగా తీసుకున్న రూ.17 లక్షలు తిరిగి చెల్లించకుండా వైఎస్సార్సీపీ నాయకుడు బెదిరిస్తున్నారని ఉండవల్లికి చెందిన కూనపురెడ్డి రమేష్ మంత్రి లోకేశ్‌కి వినతి పత్రం అందజేశారు. దేవినేని అవినాష్ అండతో తమ సొమ్మును చెల్లించలేదని వాపోయారు. విజయవాడకు చెందిన బీవీ సుబ్బారెడ్డి తన వద్ద రూ.17 లక్షలు అప్పుగా తీసుకున్నారని పేర్కొన్నారు. తిరిగి చెల్లించమంటే దేవినేని అవినాష్ అనుచరులతో ప్రామీసరీ నోట్లను, చెక్కులను లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని వాపోయారు.
వైఎస్సార్సీపీ సర్కార్ వైఫల్యం - ప్రజా దర్బార్‌కు వినతుల వెల్లువ - YSRCP Victims at Praja Darbar