Nandamuri Balakrishna Swarnandhra Sakara Yatra in Gudluru : నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత, ప్రముఖ సినీహీరో నందమూరి బాలకృష్ణ పర్యటించారు. జిల్లాలోని గుడ్లూరు మండలంలో 'స్వర్ణాంధ్ర సాకార యాత్ర’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైసీపీ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మీకు వెలుగు కావాలా? చీకటికావాలా?. స్వర్ణయుగం కావాలా? రాతి యుగం కావాలా?. ఓటుకు వెలకట్టవద్దు అంటూ బాలకృష్ణ ప్రసంగానికి అభిమానులు ఉర్రూతలూగారు. సభకి టీడీపీ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. సభలో బాలకృష్ణ ప్రసంగానికి అభిమానులు, కార్యకర్తలు ఈలలతో,కేకలతో ప్రోత్సహించారు.
ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బాలకృష్ణ - వైసీపీ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపు
జిల్లాలోని గుడ్లూరులో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో ఈరోజు సీనీనటుడు నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. బహిరంగ సభలో బాలకృష్ణ మాట్లాడుతూ, ఈ ఎన్నికల రణరంగంలో అందరం కలిసి పోరాటంచేయాలి. జగన్ మోహన్ రెడ్డిని ఓడించాలి అని పిలుపునిచ్చారు. నందమూరి తారకరామారావు ఒక చరిత్ర అని. చేనేత కార్మికుల వృత్తిని ప్రోత్సహించేందుకు ఎన్టీఆర్ ఖాదీ వస్త్రాలు దరించాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు.
NBK Rally IN Nellore District :రాష్ట్రానికి ఎన్నో ప్రాజెక్టులను తీసుకువచ్చారని. ఎన్టీఆర్ మానసపుత్రిక తెలుగుదేశం పార్టీనే అన్నారు. పార్టీ కోసం ప్రాణలు సైతం ఇచ్చే కార్యకర్తలు ఉన్న ఎకైక పార్టీ టీడీపీ అని గుర్తుచేశారు. చంద్రబాబునాయుడు అదే అభివృద్ధిని కొనసాగించారని తెలిపారు. ఐటీరంగం అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. కానీ, ఈరోజు వైసీపీ సిద్దం హోర్డింగ్ లతో రాష్ట్రన్ని నింపారని విమర్శించారు. అభివృద్ధి అంటే హోర్డింగ్లు పెట్టుకోవడమా అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రాలేదు. ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయన ఆగ్రహం వ్యక్తం చేశారు.