ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్న క్యాంటీన్లలో భోజనం ఉచితంగా అందిస్తాం - వైఎస్సార్సీపీలో ఒకరిద్దరూ మిగలరు : గంటా - ANNA CANTEENS IN AP

భవిష్యత్తులో అన్న క్యాంటీన్లలో భోజనం ఉచితంగా అందించే ఆలోచన ఉందన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు - దోచుకున్న ఆస్తులు కాపాడుకోవడానికి జగన్‌ తాపత్రయపడుతున్నారని వెల్లడి

MLA Ganta Srinivasa Rao Says Free Meals in Anna Canteens
MLA Ganta Srinivasa Rao Says Free Meals in Anna Canteens (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 1, 2024, 3:28 PM IST

MLA Ganta Srinivasa Rao Says Free Meals in Anna Canteens :భవిష్యత్తులో అన్న క్యాంటీన్లలో భోజనం ఉచితంగా అందించే ఆలోచన ఉందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. అధ్వాన రోడ్లపై దృష్టి పెట్టామని, అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నామని వెల్లడించారు. విశాఖ ఎంవీపీ కాలనీలోని నివాసంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖకు మరిన్ని ఐటీ కంపెనీలు వచ్చేలా ఐటీ మంత్రి నారా లోకేశ్‌ కృషి చేస్తున్నారని, నగర అభివృద్ధిపై సీఎం చంద్రబాబు శనివారం సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ అంశంలో చిత్తశుద్ధితో ఉన్నామని అన్నారు. గ్రామ వాలంటీర్లు లేకుండా పింఛన్ల పంపిణీ సాధ్యం కాదన్న వైఎస్సార్సీపీ నేతలు ఇప్పుడు చూస్తున్నారా? అని ఎద్దేవా చేశారు.

వైఎస్సార్సీపీలో ఎవ్వరూ ఉండరు : దోచుకున్న ఆస్తులు కాపాడుకునేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి తాపత్రయ పడుతున్నారని గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఆ పార్టీ మునిగిపోయిన నావ అని, ఒకరిద్దరు కూడా అందులో మిగలరని జోష్యం చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details