Minister Lokesh Interaction with Students : 'నేను ముఖ్యమంత్రిని కాదు మంత్రిని' అంటూ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యాలు నవ్వుల పువ్వులు పూయించాయి. 'ముఖ్యమంత్రిని చేసి ఉన్న మంత్రి పదవిని కూడా ఉడించేలా ఉన్నావ్' అంటూ విజయవాడ పాయకపురం ప్రభుత్వ జూనీయర్ కళాశాలలో ఓ విద్యార్థితో మంత్రి లోకేశ్ సరదా వ్యాఖ్యాలు చేశారు. మధ్యహ్న భోజనం పథకం ప్రారంభోత్సవంలో భాగంగా నిన్న ముఖాముఖిలో భాగంగా ఓ విద్యార్థి లోకేశ్‌ను ముఖ్యమంత్రి అని సంబోధించగా లోకేశ్ ఈ విధంగా ఛలోక్తి విసిరారు.
ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు : ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన అనంతరం లోకేశ్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సంధర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ఏపీలో ఉద్యోగాలు లేక విదేశాలకు వెళ్లిపోతున్నారని దీనిపై ప్రభుత్వ చర్యలేంటని ఓ విద్యార్థి అడగగా అనేక పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొస్తున్నామని లోకేశ్ సమాధానమిచ్చారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు ఇక్కడే ఉద్యోగం దొరికేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు.