ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైఎస్సార్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం లేదు - వారు చేసిన పాపాలే వెంటాడుతున్నాయి' - AP MINISTERS COMMENTS ON YS JAGAN - AP MINISTERS COMMENTS ON YS JAGAN

Minister Dola Sensational Comments on YS Jagan : వైఎస్సార్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం లేదని, గతంలో వారు చేసిన పాపాలే వారిని వెంటాడుతున్నాయని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కాలువ కట్టల మీద మట్టిని కూడా వైఎస్సార్సీపీ నాయకులు వదలకుండా దోచుకెళ్లారని విమర్శించారు. విజయవాడ వరద పాపం జగన్ దేనని ఆరోపించారు.

Minister Dola Sensational Comments on YS Jagan
Minister Dola Sensational Comments on YS Jagan (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 15, 2024, 6:22 PM IST

Minister Dola Sensational Comments on YS Jagan : వైఎస్సార్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం లేదని, గతంలో వారు చేసిన పాపాలే వారిని వెంటాడుతున్నాయని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు చేసిన తప్పులపై మాత్రమే కేసులు పెట్టి విచారిస్తున్నామని చెప్పారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో వరదలు వస్తే జగన్ వారం రోజుల తర్వాత బయటకు వచ్చేవాడని ఎద్దేవా చేశారు. తాజాగా విజయవాడలో వరదలు వస్తే సీఎం చంద్రబాబు దగ్గరుండి రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశారని గుర్తుచేశారు.

అందుకే విజయవాడ త్వరగా కోలుకుందని తెలిపారు. అలాగే వరద నీటిని సైతం లెక్కచేయకుండా ముఖ్యమంత్రి జేసీబీ మీద 20 కిలో మీటర్లు తిరిగి ముంపు ప్రాంతాల్లో పరిస్థితిని చక్కదిద్దారని అన్నారు. కాలువ కట్టల మీద మట్టిని కూడా వైఎస్సార్సీపీ నాయకులు వదలకుండా దోచుకెళ్లారని విమర్శించారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బాధితులకు ప్రకటించిన రూ.కోటి పరిహారం ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు. విజయవాడ వరద పాపం జగన్ దేనని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు.

జగన్ జమానాలో పోస్టుకో రేటు - సహ చట్టం ద్వారా వెలుగులోకి అక్రమ నియామకాలు - Sale Non Teaching Staff Posts

MINISTER SATYA KUMAR ON YS JAGAN: రాష్ట్రంలో ప్రారంభించిన వైద్య కళాశాలల నిర్మాణంలో ఒక్కటీ పూర్తిచేయని ఘనత జగన్‌ ప్రభుత్వానికే దక్కుతుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ ఎద్దేవా చేశారు. 17 వైద్యకళాశాలలు నిర్మాణంలో ఉంటే వీటిలో సగానికిపైగా పునాది దశలోనే ఉన్నాయన్నారు. విద్యార్థులకు కళాశాలల్లో గదుల కొరతే కాక సిబ్బంది కొరత కూడా ఉందన్నారు. నిర్మాణం పూర్తికాకుండానే గతేడాది రాజమండ్రి వైద్యకళాశాలను ప్రారంభించారని, విద్యార్థులకు తరగతి గదులు కూడా లేవని చెప్పారు.

జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందుల వైద్యకళాశాలలో 48 శాతం బోధనా సిబ్బంది లేరని మంత్రి సత్యకుమార్‌ వెల్లడించారు. తరగతి గదుల కొరతను ఎలాగోలా పరిష్కరిస్తామని, విద్యార్థులకు జగన్‌ పాఠాలు చెబుతారా అని ఎద్దేవా చేశారు. జగన్‌ లాంటి అసమర్థ వ్యక్తి ముఖ్యమంత్రి ఎలా అయ్యారో అర్థం కావడంలేదన్నారు. వైద్య కళాశాలల విషయంలో అసత్యప్రచారం తగదన్నారు. అసత్యాలు ప్రచారం చేస్తున్నారనే ప్రజలు 11 సీట్లు ఇచ్చారని అన్నారు. ప్రజాభిప్రాయాన్ని అర్థంచేసుకుని ఇప్పటికైనా మారాలంటూ హితవు పలికారు.

ఏపీలో కొత్త జాతీయ రహదారులపై చంద్రబాబు ఫోకస్ - ఇక పనులు స్పీడ్ అప్ - AP Govt Focus on National Highways

బుడమేరుకు గండ్లు పడలేదు - ప్రజలు ఆందోళన చెందవద్దు: మంత్రి నారాయణ - Budameru Breach Fake News

ABOUT THE AUTHOR

...view details