ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మావోయిస్ట్ అగ్రనేత చలపతి అంత్యక్రియలు పూర్తి - MAOIST LEADER CHALAPATHI LAST RITES

బొడ్డపాడులో మావోయిస్ట్ అగ్రనేత చలపతి అంత్యక్రియలు పూర్తి - మృతదేహాన్ని బొడ్డపాడుకు తెచ్చిన బంధుమిత్రులు - ఛత్తీస్‌గఢ్‌- ఒడిశా సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌లో మరణించిన చలపతి

Maoist_Leader_Chalapathi_Last_Rites
Maoist_Leader_Chalapathi_Last_Rites (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2025, 10:36 PM IST

Maoist Leader Chalapathi Last Rites Completed:శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడులో మావోయిస్ట్ అగ్రనేత చలపతి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అమరుల బంధు మిత్రుల సంఘం సభ్యులు చలపతి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం మధ్యాహ్నం బొడ్డపాడు తీసుకొచ్చారు. చలపతి భార్య అరుణ అలియాస్ రుక్మిణీ సొంతూరు బొడ్డపాడు. దీంతో చలపతి మృతదేహాన్ని అక్కడికి తీసుకొచ్చి విప్లవ గీతాలు పాడి అంత్యక్రియలు చేశారు. ఛత్తీస్​గఢ్ - ఒడిశా సరిహద్దుల్లో మంగళవారం జరిగిన ఎన్ కౌంటర్​లో చలపతి మరణించారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతిపై కోటి రూపాయల రివార్డు ఉంది.

చలపతిపై రూ.కోటి రివార్డు:ఇటీవల ఛత్తీస్​గఢ్​- ఒడిశా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్​కౌంటర్​ జరిగిన విషయం తెలిసిందే. అందులో మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారు. వారిలో నక్సలిజం కేంద్ర కమిటీ సభ్యులు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి, మనోజ్‌, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై గతంలో అలిపిరిలో జరిగిన దాడి కేసులో చలపతి కీలక సూత్రధారి. చిత్తూరు జిల్లా వాసి అయిన అతడిపై రూ.కోటి రివార్డు ఉంది.

చలపతి ఇలా చిక్కారు:మావోయిస్టు అగ్రనేత చలపతి ఎన్‌కౌంటర్‌తో ముడిపడిన మరో కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. జనవరి 20న ఆయన ఎన్‌కౌంటర్‌కు దారితీసిన బలమైన కారణం ఒకటి వెలుగులోకి వచ్చింది. 2016 సంవత్సరం మే నెలలో ఆంధ్రప్రదేశ్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఆ సందర్భంగా మావోయిస్టులకు చెందిన ఒక స్మార్ట్ ఫోన్‌ పోలీసుల చేతికి చిక్కింది. దానిలోని సమాచారాన్ని జల్లెడపట్టగా మావోయిస్టు అగ్రనేత చలపతి తన భార్య అరుణతో దిగిన ఒక సెల్ఫీ కనిపించింది. ఎప్పుడో యువకుడిగా ఉన్నప్పుడు మావోయిస్టుల్లో చేరిన చలపతి రూపురేఖలు ఎలా ఉన్నాయి ? అతడి పోలికలు ఏమిటి ? అనేది అంతుచిక్కకుండా ఉన్న తరుణంలో ఈ సమాచారం పోలీసులకు బాగా ఉపయోగపడింది.

రూ.1 కోటి రివార్డు కలిగిన చలపతిని పట్టుకునే దిశగా భద్రతా బలగాలను నడిపించింది. తన సెల్ఫీ ఫొటో పోలీసులకు దొరికిందని తెలిసినప్పటి నుంచి చలపతి అప్రమత్తం అయ్యాడు. ఎక్కడికి వెళ్లినా తన వెంట డజన్ల కొద్దీ మావోయిస్టులను రక్షణగా తీసుకెళ్లేవాడు. ఈక్రమంలో జనవరి 20వ తేదీన (సోమవారం) తెల్లవారుజామున ఛత్తీస్‌గఢ్- ఒడిశా సరిహద్దుల్లోని అడవుల్లో తన టీమ్‌తో కలిసి చలపతి వెళ్తుండగా భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఆయనతో పాటు 14 మంది మావోయిస్టులను మట్టుబెట్టాయి. సెల్ఫీలో ఉన్న ఫొటో, అక్కడ చనిపోయిన ఒక మావోయిస్టు మొహం ఒకేలా ఉందని నిర్ధరించుకున్నారు.

బొమ్మలకు ప్రాణం పోస్తున్న మహిళలు - ప్రసిద్ధ ఉదయగిరి బొమ్మల గురించి మీకు తెలుసా?

కన్నీరు పెడుతున్న కృష్ణమ్మ - స్నానాలు చేసేందుకు జంకుతున్న జనం

ABOUT THE AUTHOR

...view details