Land Titling act People Problems :వైఎస్సార్సీపీ ప్రభుత్వం బలవంతంగా తీసుకువస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్ల ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ భూములకు రక్షణ లేకుండా పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యజమానికి తెలియకుండా ఇతర వ్యక్తులు తమ భూములను కాజేసే అవకాశం ఉందని రైతులు కలవరపడుతున్నారు. భూ హక్కు చట్టం అమలోకి వస్తే పూర్తిగా తమ భూములు కోల్పోతామంటున్న రైతులతో ఈటీవీ ప్రతినిధి ఉమామహేష్ ముఖాముఖి.
భూ హక్కులకు మడతపెట్టేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022!
ల్యాండ్ టైటిలింగ్ చట్టం-2019 భూ పత్రాలు, దస్త్రాల ట్యాంపరింగ్ జరగకుండా ఈ చట్టం తోడ్పడుతుందని అధికారులు చెప్తున్నారు. భూమి ఉన్నా పట్టాదారు పాసు పుస్తకాలు లేకపోవడం, రికార్డుల్లో లోపాల కారణంగా చాలామంది యజమానులు పూర్తి స్థాయిలో హక్కులు పొందలేకపోతున్నారని, ఫలితంగా భూ వివాదాలు ఏర్పడితే సమస్యను పరిష్కరించలేని పరిస్థితి ఏర్పడుతోందని ఈ చట్టం వల్ల ఆ సమస్యలు తొలగిపోతాయంటున్న ఇధికారులు. భూ రికార్డులు సరిగా లేని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ పథకాలు లబ్ది పొందేందుకూ ఇబ్బంది పడుతున్నారని దీని వల్ల ఊరట పొందొచ్చని ప్రభుత్వ ప్రజల్ని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేసింది.
భూహక్కు చట్టంతో ప్రజలకు తీవ్ర నష్టం - వెంటనే రద్దు చేయాలంటూ న్యాయవాదుల నిరసనలు