ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం - అడిషనల్ ఎస్పీపై రెచ్చిపోయిన కేతిరెడ్డి పెద్దారెడ్డి - Pedda Reddy Comments On Police - PEDDA REDDY COMMENTS ON POLICE

Kethireddy Pedda Reddy Vulgar Words On Police at Tadipatri: పోలింగ్​ వేళ అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి అడిషనల్​ ఎస్పీ రామకృష్ణపై అసభ్య పదజాలంతో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన అనుచరులు తెలుగుదేశం ఏజెంట్‌పై దాడికి కూడా పాల్పడ్డారు. పోలీసుల నుంచి టీడీపీ నేతలకు రక్షణ లేదని బైక్ ర్యాలీ నిర్వహించగా వైసీపీ నాయకులు రాళ్ల దాడికి తెగబడ్డారు. రాళ్ల దాడిలో కొందరు పోలీసులకు గాయాలయ్యాయి.

Pedda Reddy Vulgar Words On Police
Pedda Reddy Vulgar Words On Police

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 5:52 PM IST

తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం - అడిషనల్ ఎస్పీపై రెచ్చిపోయిన కేతిరెడ్డి పెద్దారెడ్డి

Kethireddy Pedda Reddy Vulgar Words On Police at Tadipatri:పోలింగ్‌ రోజున వైసీపీ నేతల ప్రవర్తిస్తున్న తీరుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ ఎన్నికల నిబంధనలను బేఖాతరు చేయడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పలు చోట్ల వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఎదురు తిరిగిన టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

పల్నాడులో వైఎస్సార్సీపీ దాష్టీకం - టీడీపీ నాయకులపై కర్రలతో దాడి - YSRCP Attack

తాడిపత్రిలో అడిషనల్ ఎస్పీ రామకృష్ణపై వైసీపీ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నగరంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తీవ్రస్థాయిలో రాళ్ల దాడి జరిగింది. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఇరువర్గాల కార్యకర్తలను చెదరగొట్టి పంపించేశారు. ఆ సమయంలో అక్కడ ఉన్న అడిషనల్ ఎస్పీ రామకృష్ణను కేతిరెడ్డి పెద్దారెడ్డి అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో అక్కడున్న ప్రజలు, నేతలు అందరూ ఆశ్చర్యానికి గురైయ్యారు. ఒక ప్రభుత్వ అధికారిపై ఎమ్మెల్యే ఇష్టానుసారంగా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎస్పీ రామకృష్ణపై పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.

తాడిపత్రిలో బరితెగించిన వైసీపీ కార్యకర్తలు - బాలింత అని చూడకుండా - YCP Leaders Attack

తాడిపత్రిలో పోలింగ్ ఏజెంట్‌ను సైతం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బెదిరించారు. పెద్దారెడ్డి సమక్షంలో ఆయన అనుచరులు తెలుగుదేశం ఏజెంట్‌పై దాడికి పాల్పడ్డారు. పోలింగ్‌ కేంద్రం వద్ద కేతిరెడ్డి అనుచరులు దౌర్జన్యం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని బాధితుడి కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. పోలింగ్‌ ఆపేందుకు వైసీపీ నేతలు యత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నియోజకవర్గంలో పోలీసుల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు, నేతలకు రక్షణ లేదని టీడీపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ జరుగుతున్న సమయంలోనే ఓం శాంతినగర్‌లో వైసీపీ నాయకులు రాళ్ల దాడికి తెగబడ్డారు. రాళ్ల దాడికి బయపడిన పోలీసులు చుట్టుపక్కల ఇళ్లలో దూరి దాక్కునే పరిస్థితి వచ్చింది. రాళ్ల దాడిలో కొందరు పోలీసులకు తీవ్రంగా గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉద్రిక్తతల నడుమ పోలింగ్ - స్వతంత్ర అభ్యర్థిపై వైఎస్సార్సీపీ దాడి - andhra pradesh elections 2024

ABOUT THE AUTHOR

...view details