Irrigation Officer Checking At Sand Quarry: ఇసుక రీచ్ల వద్ద అక్రమ తవ్వకాలపై కలెక్టరు ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారులతో పాటు పలు శాఖల అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి, నాలుగు రోజుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ తవ్వకాలు ఆపేలా చర్యలు చేపట్టాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం వేములపల్లిలో ఇసుక క్వారీలను ఇరిగేషన్‌తో పాటు పలు శాఖల అధికారుల బృందం పరిశీలించింది.
ఇసుక రవాణా ట్రక్కులపై టార్పాలిన్ తప్పనిసరి- ఆ రెండు కంపెనీలకు హైకోర్టు నోటీసులు - SAND TRANSPORT
వారు పరిశీలించిన ప్రదేశానికి సమీపంలోనే రాత్రి వేళల్లో రవాణాకు వీలుగా ఇసుకను కుప్పలుగా పోసి ఉంచిన వాటిని మాత్రం పట్టించుకోలేదు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు మైనింగ్ డీడీ సుబ్రమ్మణ్యం దాటవేత ధోరణిలో సమాధానాలిచ్చారు. రీచ్‌లను పరిశీలించారు కదా, ఎక్కడైనా అక్రమ రవాణా విషయం గుర్తించారా? అని అడగ్గా, ఏ రీచ్‌లోనూ భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపినట్లు కనిపించలేదన్నారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు రెండు క్యారీల్లో తవ్వకాలు జరగట్లేదని నిర్ధారించారు. ఇసుక అక్రమాలపై ఫిర్యాదు చేసినా ఇంతవరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించగా, తమ పరిశీలనలో తేలిన విషయాలను కలెక్టరుకు నివేదిక అందిస్తామని తెలిపారు.