Illegal Sand Mining in Bapatla District :ఇసుక అక్రమ వ్యాపారం బాపట్ల జిల్లా చీరాల చుట్టుపక్కల ప్రాంతాల్లో జోరందుకుంది. ఇసుక రవాణాకు ఎటువంటి అనుమతుల్లేకపోయినా పెద్దల అండతో దర్జాగా అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతోంది. దీనిపై అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో యథేచ్ఛగా జేసీబీలు పెట్టి మరీ తవ్వేస్తున్నారు.
అయినా అదికారులు ఆవైపు కన్నెత్తి చూడని పరిస్థితి నెలకొంది. జిల్లా అదికారులు ప్రశ్నిస్తే తప్ప ఇసుక అక్రమ రవాణా చేసే ట్రాక్టర్లను పట్టుకోని పరిస్థితి ఉండడం గమనార్హం తవ్వకాల్లో అక్రమార్కుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. చీరాల మండలం బోయిన వారిపాలెం-స్టువార్టుపురం మధ్య ఉన్న టీ.పీ పంపింగ్ స్కీం వద్ద ఉంచిన జేసీబీని గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు.