ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రబాబును కలవడానికి పోటీపడుతున్న అధికారులు, నాయకులు - Govt Officers Meet Chandrababu - GOVT OFFICERS MEET CHANDRABABU

Goverment Officers Meet Chandrababu House : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ విజయం సాధించడంతో పార్టీ అధినేత చంద్రబాబుకు శుభాకంక్షలు తెలపడానికి రాష్ట్ర ఉన్నతాధికారులు ఆయన నివాసానికి చేరుకున్నారు. వారితో పాటు ఎన్నికల గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయన నివాసం వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

tdp_chandrababu_meet
tdp_chandrababu_meet (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 5, 2024, 12:35 PM IST

Goverment Officers Meet Chandrababu House :ఏపీ సార్వత్రిక ఫలితాల్లో అనూహ్యమైన ఫలితాలు సాధించిన టీడీపీ అధినేతను కలవడానికి రాష్ట్రంలోని ఉన్నతాధికారులు చంద్రబాబు నివాసం వద్ద క్యూ కట్టారు. వీరితో పాటు తాజా ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయన్ను కలసి శుభాకాంక్షలు తెలపడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలిసేందుకు ప్రభుత్వ ఉన్నతాధికారులు, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్​లు పలువురు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన నివాసానికి చేరుకున్నారు. పర్యావరణం, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ చంద్రబాబు ని కలిసేందుకు ఉండవల్లిలోని ఆయన ఇంటికి వచ్చారు.

జనాగ్రహానికి నేలకరిచిన నియంత - కుప్పకూలిన జగన్‌ నిరంకుశ రాజ్యం - YSRCP Defeat In Assembly Elections

చంద్రబాబు నివాసానికి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కేశినేని చిన్నీ, బోండా ఉమా, డోలా బాలవీరాంజనేయ స్వామి, ధూళిపాళ్ల నరేంద్ర, పెమ్మాసాని చంద్రశేఖర్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, అయితాబత్తుల ఆనందరావు, బోడె ప్రసాద్, అనగాని సత్యప్రసాద్ తదితరులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు చేరుకున్నారు.

దేశం దాటుతున్నCID Chief సంజయ్ -భయపడి పారిపోతున్నాడంటూ ట్రోలింగ్‌ - AP CID Chief Sanjay On Leave

ఇవాళ ఉదయం (జూన్​ 5న) 10 గంటలకు చంద్రబాబు మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం మొదటిసారిగా మీడియాతో సంభాషించారు. కూటమి ఘనవిజయంపై ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రాష్ట్ర భవిష్యత్​ కార్యాచరణ గురించి మాట్లాడతారని పార్టీలో వర్గాల చర్చించుకున్నట్లు సమాచారం. మీడియా సమావేశం అనంతరం ఇవాళ ఉదయం 11 గంటలకు దిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు.

నోటి మాటలకు ఓటు దెబ్బ - రాజకీయ విమర్శ శ్రుతిమించితే భరించలేమని జనం తీర్పు - YSRCP Ministers Used Bad Words

ABOUT THE AUTHOR

...view details