TOP TEN DOG BREEDS : మనుషులతో కుక్కలకు విడదీయరాని సంబంధం ఉంటుంది. విశ్వాసానికి మారుపేరుగా నిలిచే జంతువులు కుక్కలు మాత్రమే. ఇవి మనుషులకు అత్యంత స్నేహితులుగా ఉంటాయి. వీటిలో కొన్ని జాతులు మరింత అంకితభావంతో మెసులుకుంటాయి. అలాంటి వాటిలో టాప్ 10 కుక్క జాతుల గురించి తెలుసుకుందాం.
గోల్డెన్ రిట్రీవర్
మేలు జాతి శునకాల్లో గోల్డెన్ రిట్రీవర్ ముందు వరుసలో ఉంటుంది. ఈ జాతి గుణగణాలు ఎంతో ప్రత్యేకం. స్నేహశీలత, శాంత స్వభావంతో పాటు తెలివైనవి, పిల్లలతో బాగా కలిసిపోతాయి. వీటికి మనుషులతో ఆడుకోవడం, యజమానులను సంతోషపెట్టడం చాలా ఇష్టం.
కింగ్ కోబ్రాతో పెంపుడు కుక్కల ఫైట్- యజమాని ప్రాణాలు కాపాడినా!
లాబ్రడార్ రిట్రీవర్
లాబ్రడార్ రిట్రీవర్ శక్తివంతమైనవి. నీటిని ఇష్టపడతాయి, శిక్షణకు త్వరగా అలవాటుపడతాయి. స్నేహంతో మసులుకుంటాయి. అందుకే వీటిని సర్వతోముఖ కుక్కలుగా పిలుస్తారు. అన్ని రకాల పనులకు వీటిని ఉపయోగించవచ్చు.
జర్మన్ షెపర్డ్
జర్మన్ షెపర్డ్ జాతి శునకాలు ఎంతో తెలివైనవి, ధైర్యవంతమైనవి. రక్షణకు అనువైన జర్మన్ షెపర్డ్ శిక్షణకు త్వరగా అలవాటుపడతాయి. తమ యజమానులను రక్షించాలనే కోరిక ఎక్కువ కాబట్టే ఇవి ప్రాణాలకు తెగించి కాపాడిన సందర్భాలు అనేకం.
బీగిల్
బీగిల్ జాతి శునకాలకు ఆటలంటో అమితాసక్తి, స్నేహ లక్షణాలు కలిగిన ఈ జాతి కుక్కలు వాసన గుర్తించడంలో ఎంతో శక్తివతమైనవి. మానవులతో సమయం గడపడం వీటికి చాలా ఇష్టం.
బాక్సర్
బాక్సర్ జాతి శునకాలు శక్తివంతమైనవి, ఆటలాడుకోవడం ఇష్టపడతాయి, పిల్లలతో బాగా కలిసిపోతాయి. వీటికి తమ యజమానులను సంతోషపెట్టాలనే కోరిక ఎక్కువ.