ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు- తక్షణమే రిలీవ్​ కావాలని ఆదేశాలు - Anantapur DIG Ammireddy transfer

Anantapur DIG Ammireddy: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. అమ్మిరెడ్డి తక్షణమే విధుల నుంచి రిలీవ్‌ కావాలని ఆదేశాలు జారీచేసింది. అమ్మిరెడ్డికి ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించొద్దని ఈసీ తన ఆదేశాల్లో పేర్కొంది.

Anantapur DIG Ammireddy
Anantapur DIG Ammireddy (etv bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 6, 2024, 2:53 PM IST

Updated : May 6, 2024, 3:06 PM IST

Anantapur DIG Ammireddy: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని పలువురు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు కొనసాగుతోంది. ఇటీవల ఎస్పీ అన్బురాజన్‌ను బదిలీ చేసిన ఈసీ, తాజాగా అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై వేటు వేసింది. తక్షణమే విధుల నుంచి రిలీవ్‌ కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఎన్నికల విధులు అప్పగించొద్దని ఉన్నతాధికారులను ఆదేశించింది. ఆ బాధ్యతలను దిగువ స్థాయి అధికారికి అప్పగించాలని సూచించింది. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

అలాగే, అనంతపురం అర్బన్ డీఎస్పీగా టివివి. ప్రతాప్ కుమార్‌, రాయచోటి డీఎస్పీగా రామచంద్రరావును నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో అన్బురాజన్‌ను ఈసీ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో అమిత్‌ బర్దర్‌ను నియమించింది.

Last Updated : May 6, 2024, 3:06 PM IST

ABOUT THE AUTHOR

...view details