ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నేను రైస్ పెట్టేస్తా - నువ్వు కర్రీస్​ తెచ్చేయ్' - ఇప్పుడు పల్లెలోనూ ఇదే ట్రెండ్! - CURRY POINT CULTURE IN VILLAGES

అంతకంతకూ పెరుగుతున్న కర్రీ పాయింట్లు - జిల్లాల్లో విస్తరిస్తున్న కొత్త సంస్కృతి

curry_points_expanding
curry_points_expanding (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 3, 2024, 10:24 AM IST

Updated : Nov 3, 2024, 10:51 AM IST

Curry Point Culture in Villages : అమ్మా అక్కాబావ వచ్చారు ఏం కూర చేద్దాం? పక్క వీధిలో ఉన్న కర్రీ పాయింట్‌లో రెండు వేపుడు కూరలు, ఒక సాంబారు, ఒక పెరుగు ప్యాకెట్‌ కొనుకొచ్చేయ్‌ అందరికీ సరిపోతాయ్‌. ఏవండీ టౌన్‌ నుంచి వచ్చేటప్పుడు మధ్యాహ్నానికి ఒక క్యాబేజీ వేపుడు, పప్పు తీసుకొచ్చేయండి అన్నం పెట్టేస్తా’ ఈ మాటలు ఇప్పుడు గ్రామాల్లోనూ వినిపిస్తున్నాయి. కర్రీ పాయింట్స్‌ అనగానే మనకు పట్టణాలే గుర్తొస్తాయి. కానీ అదంతా ఒకప్పుడు నేడు పల్లెల్లోనూ ఈ కల్చర్​ కనిపిస్తోంది.

కొందరు మండల కేంద్రాల నుంచో పట్టణాల నుంచో తిరిగి వచ్చేటప్పుడు ఇళ్లకు కర్రీలను కొనుగోలు చేసుకుని తీసుకెళ్తున్నారు. మరికొన్నిచోట్ల అయితే గ్రామాల్లోనూ వండిన కూరలు దొరుకుతున్నాయి. ఈమధ్య కాలంలో పలు పల్లెల్లో ఈ కర్రీస్‌ పాయింట్ల వల్ల కొందరికి ఉపాధి దొరుకుతుంది. మరికొందరికి అవసరానికి ఆదుకుంటున్నాయి.మండల కేంద్రాల్లో కర్రీ పాయింట్లు ఉండగా, ఇప్పుడు గ్రామగ్రామాల్లో అంతంతకంతకూ పెరుగుతున్నాయి. దీంతో చాలామంది మహిళలు సొంతూరిలో స్వయం ఉపాధి పొందుతున్నారు.

సాధారణంగా గ్రామాల్లో ఉదయం టిఫిన్స్ వంటివి ఎవరి ఇళ్లల్లో వారే చేసుకునేవారు. టీ కూడా ఇంట్లోనే తాగేవారు. అలాంటిది ఇప్పుడు పల్లెల్లో అల్పాహార, టీ దుకాణాలు వెలిశాయి. తాజాగా కర్రీ పాయింట్లు కూడా వెలుస్తున్నాయి. అంటే చివరకు మధ్యాహ్నం కూరలు కూడా వండుకోవడం లేదని అర్థమవుతోంది.

బయట కర్రీస్​ కొనడానికి గల కారణాలు :

  • కూలి పనులకు వెళ్లే వారికి సమయం లేకపోవడం
  • పనులు చేసి చేసి వచ్చి వండుకోవాలంటే కష్టంతో కూడుకున్నది కావడం
  • మరోవైపు కూరగాయల ధరలు కూడా పెరగడం

ఒంటరిగా ఉండే వారిని ఆదుకుంటున్నాయి : ఒకప్పుడు పల్లెలోని ఇళ్లకు బంధువులు ఇంటికి వస్తే ఇంట్లోనే సొంతంగా వండి వార్చేవారు. నేడు గ్రామాల్లో కూడా ఇంటికొచ్చినవారికి సొంతంగా కూరలు తయారు చేసి పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇళ్లకు బంధువులు వస్తే వెంటనే కర్రీ పాయింట్​కు వెళ్లి కావాల్సినవి తెచ్చుకుంటున్నారు. సమయం లేక కొందరు, కొంతమంది పిల్లలు విదేశాల్లో ఉండటంతో వృద్ధులు వయోభారంతో, చదువు నిమిత్తం పిల్లలు ఎక్కడో ఉంటే ఒంటరిగా ఉండే తల్లిదండ్రులు, ఇలా పట్టణ ప్రజలతో పాటు పల్లె వాసులు కూడా నేడు కర్రీస్‌ పాయింట్ల వద్ద క్యూ కడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. నేడు ఏ గ్రామంలో చూసినా కూరల అమ్మకాలు పెరిగాయి. దీంతో పల్లెల్లో స్వయం ఉపాధి పొందడానికి ఇదొక మంచి అవకాశంగా మారింది.

ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు గ్రామగ్రామాల్లో కర్రీ పాయింట్లు అంతంతకంతకూ పెరుగుతున్నాయి. దీంతో చాలామంది మహిళలు సొంతూరిలో స్వయం ఉపాధి పొందుతున్నారు. మొదట్లో భోజనాలతో పాటు కొద్దిగా కూరల ప్యాకెట్లు తయారు చేసి అమ్మేవాళ్లమని రవ్వారం గ్రామానికి చెందిన కర్రీ పాయింట్ నిర్వాహకురాలు రామలక్ష్మి తెలిపారు. జనాలు ఎక్కువగా వచ్చి కూరలు కావాలని అడుగుతున్నారని చెప్పారు. దీంతో ఇప్పుడు మాతో పాటు మరో ఇద్దరు పని వాళ్లను కూడా పెట్టుకుని తయారు చేయిస్తున్నామని అన్నారు. మొదట్లో ప్యాకెట్టు రూ.10కి విక్రయించే వాళ్లమని కూరగాయల ధరలతో పాటు నిత్యావసర సరకుల ధరలు పెరగడం వలన రూ.20కి పెంచామని వివరించారు. తమ గ్రామానికి చుట్టుపక్కల 10 పల్లెలున్నాయని వారంతా ఉదయం, సాయంత్రం వచ్చి కొంటున్నారని రామలక్ష్మి వెల్లడించారు.

పండుగ వేళ పస్తులేనా? సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న నిత్యావసరాలు

"మన దగ్గర బేరాల్లేవమ్మా!" - భయపెడుతున్న రైతు బజార్ మార్కెట్ రేట్లు

Last Updated : Nov 3, 2024, 10:51 AM IST

ABOUT THE AUTHOR

...view details