ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో సీపీఎస్ ఉద్యోగుల 'సాగర సంగ్రామ' దీక్ష - పలువురు హౌస్ అరెస్ట్​

CPS Employees Sagara Samgrama Deeksha: సీపీఎస్ రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగుల సంఘం నేతలు కోరుతున్నారు. నేడు విశాఖలో సీపీఎస్ ఉద్యోగులు 'సాగర సంగ్రామం’ పేరిట భారీ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ దీక్షను అడ్డుకునేెందుకు పోలీసులు సీపీఎస్ ఉద్యోగులను హౌస్ అరెస్టులు చేస్తున్నారు.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 4, 2024, 8:15 AM IST

Police House Arresting The CPS Employees Union Leaders
Police House Arresting The CPS Employees Union Leaders

CPS Employees Sagara Samgrama Deeksha at Visakha: రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారు. సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో చేపట్టిన సాగర సంగ్రామ దీక్షకు హాజరు కాకుండా నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. సీపీఎస్ ఉద్యోగ సంఘాల నేతల అరెస్టులను అసోసియేషన్ నేతలు ఖండించారు. విశాఖపట్నంలో సాగర సంగ్రామ దీక్షకు సీపీఎస్ ఉద్యోగులు హాజరుకాకుండా ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లి నిర్బంధించడం వంటి నిరంకుశ చర్యలు చేపడుతున్నారని ఆక్షేపించారు. శాంతియుతంగా ధర్నా చేసేందుకు అనుమతి తీసుకున్నా అరెస్టులు, నిర్బంధాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్ ఉద్యోగులను మోసగించారని మండిపడ్డారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఓపీఎస్ కోసం దద్ధరిల్లిన కలెక్టరేట్ల్.. జీపీఎస్​ను అంగీకరించే ప్రసక్తే లేదన్న ఉపాధ్యాయ సంఘాలు

CM Jagan promise was not implemented in CPS Employes: పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తామని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం 'సాగర సంగ్రామం’ పేరిట భారీ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మూడు వేల మంది ఉపాధ్యాయులు, ఇతర శాఖల్లోని సీపీఎస్‌ ఉద్యోగులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కార్యక్రమానికి సంబంధించి సంఘం నాయకులు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ఉద్యోగులు ఆందోళనలో పాల్గొనకుండా నగర పోలీసులు ముందుగానే అరెస్టు చేస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డిని నమ్మితే చెవిలో పువ్వులు పెట్టాడు - గుండు కొట్టించుకుని నిరసన తెలిపిన సీపీఎస్ ఉద్యోగులు

CPS Should be Abolished Implemented The Old Pension System: సీఎం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కానీ, అదికారంలోకి వచ్చి నాలుగున్నర సంత్సరాలు గడుస్తున్నప్పటికీ, ఇచ్చిన హామీని మాత్రం అమలు చేయకుండా తమను మోసం చేశారని సీపీఎస్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం తమను మోసం చేసిందంటూ సీపీఎస్ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయనున్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పే పార్టీకే తాము మద్దతు ఇస్తామని సీపీఎస్ ఉద్యోగులు తెలిపారు. ఎన్నికల సమయంలో తమకు హామీ ఇచ్చి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని ఉద్యోగులు పేర్కొన్నారు.

ఉద్యోగులు వద్దన్నా.. శాసనసభలో జీపీఎస్ బిల్లు పెట్టడాన్ని.. వ్యతిరేకిస్తూ నిరసనలు

ABOUT THE AUTHOR

...view details