CM Chandrababu Tweet On Appointed New Vice Chancellors : ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్య సరికొత్త అధ్యాయాన్ని సూచిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైస్ ఛాన్సలర్లను పూర్తి మెరిట్ ఆధారంగా నియమించామని ఆయన తెలిపారు. భావి పౌరులను రూపొందించడంలో ఉన్నత విద్య కీలక పాత్ర పోషిస్తోందన్నారు. గత పాలనలో రాజకీయ ప్రభావం, లాబీయింగ్ వీసీల నియామక ప్రక్రియ బలహీనపడిందని విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెరిట్ ఆధారిత వ్యవస్థ విజ్ఞాన కారణానికి సేవ చేయడానికి అర్హులైన వ్యక్తులను నియమించేలా చేస్తుందన్నారు.
వైస్-ఛాన్సలర్‌గా ఎస్టీ మహిళ : సామాజిక న్యాయాన్ని ప్రోత్సహిస్తున్నామని సీఎం తెలిపారు. ఈ విధానం ఇప్పటికే ఫలితాలను అందిస్తోందన్నారు. మొట్టమొదటిసారిగా ఎస్టీ మహిళ, ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ వైస్-ఛాన్సలర్‌గా నియమితులయ్యారన్నారు. ఇది విద్య, సామాజిక న్యాయానికి గర్వకారణమైన మైలురాయిగా సీఎం పేర్కొన్నారు. కొత్తగా నియమితులైన వైస్ ఛాన్సలర్లందరినీ ఆయన అభినందించారు. విద్య విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో వారి పదవీకాలం విజయవంతం కావాలని 'ఎక్స్' వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు.