ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దివ్యాంగులకు శుభవార్త - మూడు చక్రాల వాహనం ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం - SCOOTERS FOR PHYSICALLY CHALLENGED

ఏపీలో దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాలు - ప్రతీ సంవత్సరం ఇవ్వాలని నిర్ణయం

Government Provides Three Wheeler Vehicles for Disabled Persons
Government Provides Three Wheeler Vehicles for Disabled Persons (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 5, 2024, 11:56 AM IST

Government Provides Three Wheeler Vehicles for Disabled Persons :రాష్ట్ర ప్రభుత్వం త్వరలో దివ్యాంగులకు శుభవార్త అందించనుంది. వారికి 100% రాయితీతో త్రిచక్ర వాహనాలు (Retrofitted Motor Vehicles For Physically Challenged) అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దీనికి సీఎం నారా చంద్రబాబు నాయుడు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీనికి సంబంధిత అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థికశాఖకు నివేదించారు.

వాహనాల పంపిణీకి 17.50 కోట్ల రూపాయులు :ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ (Oton Account Budget) నుంచి నిధులు విడుదల అయిన వెంటనే తదుపరి చర్యలు తీసుకోనున్నారు. 2024-2025 సంత్సరానికి ప్రతీ నియోజకవర్గానికి 10 మంది చొప్పున 1,750 మంది దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు అందించనున్నారు. ఒక్కో వాహనం ఖరీదు లక్ష రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం వాహనాల పంపిణీకి 17.50 కోట్ల రూపాయులు అవుతుందని ప్రాథమికంగా నిర్ధారించారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే టెండర్ల ప్రక్రియ నిర్వహించి 4 నెలల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి పంపిణీ చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అయినవారికే : త్రిచక్ర వాహనాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో దివ్యాంగుల నుంచి భారీగా డిమాండ్‌ ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేవలం ఒక్కసారి మాత్రమే పంపిణీ చేశారు. సుమారు 4 వేల మంది దరఖాస్తు చేసుకుంటే వైఎస్సార్సీపీ నేతలు సిఫారసు చేసిన వారికి ప్రాధాన్యతను ఇస్తూ 1,750 మందికి అందించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదిగో ఇచ్చేస్తున్నామంటూ మరోసారి జిమ్మిక్కులు చేశారు. కానీ త్రిచక్ర వాహనాలు ఇవ్వలేదు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరం నుంచే దివ్యాంగుల సంక్షేమంపై దృష్టి సారించింది. ఈ సంవత్సరం 1,750 మందికి త్రిచక్ర వాహనాలు అందించడంతో పాటు ప్రతి సంవత్సరం ఇదే స్థాయిలో అర్హులను ఎంపిక చేసి ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అర్హతలు :త్రిచక్ర వాహనాల పంపిణీకి దివ్యాంగుల అర్హతలను రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది. డిగ్రీ, ఆపై ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు, కనీసం సంవత్సరానికి పైబడి స్వయం ఉపాధి రంగంలో ఉన్న వారికి ఎంపికలో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 70%, అంతకంటే అధిక వైకల్యం ఉన్న వారు అర్హులు. 18-45 సంవత్సరాల మధ్య ఉన్న వారికి అందిస్తారు. 3 లక్షల రూపాయలలోపు ఆదాయ పరిమితి ఉండాలి.

ఇకపై ఇంటర్ విద్యార్థులకు కళాశాలల్లో ఉచిత మధ్యాహ్న భోజనం : లోకేశ్

నిర్మించని గృహాలన్నీ రద్దు - ఏపీ మారిటైమ్ పాలసీకి కేబినెట్‌ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details