ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతి తొక్కిసలాట ఘటన - న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశం - JUDICIAL INQUIRY ON TTD INCIDENT

తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం - 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు

Government Orders Judicial inquiry into Tirupati Stampede incident
Government Orders Judicial inquiry into Tirupati Stampede incident (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 22, 2025, 7:34 PM IST

Govt Ordered Judicial Inquiry into Tirupati Stampede incident:తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. ఇందుకోసం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొక్కిసలాట ఘటనపై 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

అయితే జనవరి 8వ తేదీన తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే పలువురు భక్తులు గాయపడ్డారు. ఈ ఘటనను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సీరియస్​గా తీసుకున్నారు. అనంతరం ఘటన జరిగిన ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఘటన జరిగిన తీరుపై ఆరా తీసిన చంద్రబాబు న్యాయ విచారణకు ఆదేశిస్తామని వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా జ్యుడిషియల్‌ విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details