Sajjala Rama Krishna Reddy Look Out Notice: టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసు, గన్నవరంలో దాడి కేసుతో పాటు మరో రెండు కేసుల్ని సీఐడీకి బదిలీ చేశామని డీజీపీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. సజ్జల రామకృష్ణారెడ్డిపై లుక్ ఔట్ నోటీసు ఉందని, ఒక కేసులో గుంటూరు జిల్లా ఎస్పీ ఎల్ఓసీ (Look Out Circular) జారీ చేశారని వెల్లడించారు. ఆ కేసుకు సంబంధించి డిటెయిన్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డిపై లుక్ అవుట్ నోటీసు ఉంది: ఏపీ డీజీపీ - SAJJALA RAMAKRISHNA LOOK OUT NOTICE
ఒక కేసులో గుంటూరు ఎస్పీ ఎల్‌వోసీ జారీ చేశారు - ఆ కేసుకు సంబంధించి డిటెయిన్ చేసే అవకాశం ఉంది: డీజీపీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 15, 2024, 2:50 PM IST
కల్తీ నెయ్యి కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను సుప్రీం కోర్టు అనుమానించలేదన్న డీజీపీ.. స్వతంత్ర దర్యాప్తు జరగాలన్న ఉద్దేశంతోనే ప్రత్యేక బృందం ఏర్పాటు చేస్తామని చెప్పిందని అన్నారు. ఈ సిట్‌లో ఇద్దరు సీబీఐ, ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులు, ఒక ఎఫ్స్ఎస్ఏఐ నుంచి ఒక అధికారితో ఏర్పాటు చేస్తున్నట్టు సుప్రీం కోర్టు ప్రకటించిందన్నారు. రాష్ట్రంలోని ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ, డీఐజీ గోపీనాథ్ జెట్టీల పేర్లను సిట్ సభ్యులుగా పంపామని తెలిపారు. అది స్వతంత్ర విచారణ సంస్థ అందులో రాష్ట్ర పోలీసు జోక్యం ఉండదని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు.