ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురంను క్లీన్ స్వీప్ చేసిన కూటమి! - Anantapur Election Results 2024 - ANANTAPUR ELECTION RESULTS 2024

Anantapur Election Results 2024 : ఉమ్మడి అనంతపురం ప్రజలు తెలుగుదేశానికి అఖండ విజయాన్నందించారు. వైఎస్సార్సీపీ అహంకారానికి అంతం పలికారు. మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లో 14ను కూటమికే కట్టబెట్టారు. రెండు లోక్‌సభ స్థానాల్లోనూ తెలుగుదేశాన్నే గెలిపించారు.

anantapur_election_results_2024
anantapur_election_results_2024 (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 4, 2024, 11:32 AM IST

Updated : Jun 4, 2024, 8:10 PM IST

Anantapur Election Results 2024 : అనంతపురం జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల కౌంటింగ్​ కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది. అనంతపురం అసెంబ్లీ స్థానంలో తెలుగుదేశం అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్‌ వైఎస్సార్సీపీ అభ్యర్థి అనంత వెంకట్రామిరెడ్డిపై విస్పష్ట ఆధిక్యంతో విజయంవైపు దూసుకెళ్లారు. ధర్మవరం వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌పై విజయం సాధించారు. గుంతకల్లులో టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం వైఎస్సార్సీపీ అభ్యర్థి వై.వెంకట్రామిరెడ్డిపై ఆధిక్యాన్ని సాధించారు. హిందూపురంలో టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ వైఎస్సార్సీపీ అభ్యర్థి దీపికపై స్పష్టమైన మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. కళ్యాణదుర్గంలో టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ప్రత్యర్థి తలారి రంగయ్యపై స్పష్టమైన అధిక్యంతో విజయం సాధించారు. మడకశిరలో తెలుగుదేశం అభ్యర్థి ఎం.ఎస్‌.రాజు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇరలక్కప్పపై విజయం సాధించారు. పెనుకొండలో తెలుగుదేశం అభ్యర్థి సవిత వైఎస్సార్సీపీ అభ్యర్థి ఉష శ్రీచరణ్‌పై ఆధిక్యాన్ని సాధించారు.

ఓటమి దిశగా వైఎస్సార్సీపీ - మంత్రులూ ఇంటి బాటే - defeat of YsrCP ministers 2024 ap

YSRCP Defeat in Anantapur District :పుట్టపర్తిలో తెలుగుదేశం అభ్యర్థి పల్లె సింధూరరెడ్డి వైఎస్సార్సీపీ అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డిపై విజయం పొందారు. రాయదుర్గంలో తెలుగుదేశం అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు వైఎస్సార్సీపీ అభ్యర్థి గోవిందరెడ్డిపై స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు. రాప్తాడులో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత వైఎస్సార్సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై గెలుపొందారు. శింగనమలలో తెలుగుదేశం అభ్యర్థి బండారు శ్రావణి వైస్సార్సీపీ అభ్యర్థి వీరాంజనేయులుపై గెలుపొందారు. తాడిపత్రిలో తెలుగుదేశం అభ్యర్థి జె.పి. అశ్మిత్‌ రెడ్డి వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిపై విజయం సాధించారు. ఉరవకొండలో పయ్యావుల కేశవ్‌ వైఎస్సార్సీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. కదిరిలో టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ వైఎస్సార్సీపీ అభ్యర్థి మక్బూల్‌పై గెలుపొందారు.

ఓటమి బాటలో వైఎస్సార్సీపీ - కౌంటింగ్​ ​కేంద్రాల నుంచి వెళ్లిపోతున్న అభ్యర్థులు - YSRCP Leaving Counting Center

Last Updated : Jun 4, 2024, 8:10 PM IST

ABOUT THE AUTHOR

...view details