AP Govt Focus on Facilities in Tirumala :తిరుమలలో శ్రీవాణి దర్శన టికెట్ల కుదింపు, దివ్యదర్శనం టోకెన్ల పునరుద్ధరణ, క్యూలైన్ల నియంత్రణ, కంపార్ట్మెంట్లలో భక్తులకు నాణ్యమైన అన్న ప్రసాదాల విషయంలో గడచిన రెండు నెలల్లో గణనీయమైన మార్పులు జరిగాయి. గత 5 ఏళ్లలో తిరుమల శ్రీవారి భక్తులకు దూరమైన వసతులు తిరిగి ప్రారంభమయ్యాయి. భక్తుల కష్టాలు తీర్చేందుకు కొత్త ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి.
TTD Focus on Facilities to Devotees : తిరుమల వచ్చే భక్తులు సంతృప్తికరంగా శ్రీవారిని దర్శించుకుని, భక్తిభావంతో తిరుగు ప్రయాణం కావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా టీటీడీ ఈఓ శ్యామలరావు, అదనపు ఈఓ వెంకయ్యచౌదరి కార్యాచరణ ప్రారంభించారు. టీటీడీ అదనపు ఈఓగా బాధ్యతలు చేపట్టిన వెంకయ్య చౌదరి, క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ భక్తులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.
షెడ్లు, కంపార్ట్‌మెంట్లు అందుబాటులోకి :గత ఐదేళ్ల వైఎస్సార్సీరీ పాలనలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు పడిన కష్టాలపై టీటీడీ ఈఓ, అదనవు ఈఓ దృష్టి సారించారు. అధికారులతో సమీక్షించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గడిచిన 5 సంవత్సరాలుగా మూసివేసిన నారాయణగిరి ఉద్యానవనాల షెడ్లు, ఒకటో వైకుంఠం క్యూకాంపెక్ల్స్‌లోని కంపార్ట్మెంట్లను భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. ఫలితంగా సర్వదర్శనం, దివ్యదర్శనానికి వచ్చే భక్తులను తిరుమల మొత్తం క్యూలైన్లు తిరిగే సమస్య పరిష్కారమైంది.